Salman Khan: ‘బజరంగీ భాయిజాన్’ మళ్లీ వస్తున్నాడు!

కొన్ని సినిమాలు ప్రేక్షుకులపై చెరగని ముద్ర వేస్తాయి. మళ్లీ మళ్లీ ఆ సినిమా గురించి మాట్లాడుకేనేలా చేస్తాయి. అలాంటి సినిమాల్లో కండల వీరుడు సల్మాన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘బజరంగీ భాయిజాన్’ కచ్చితంగా ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Bajarangi

Bajarangi

సల్మాన్‌ ఖాన్‌ అభిమానులకు శుభవార్త. డిసెంబర్ 19 న, సూపర్ స్టార్ తన హిట్ చిత్రం ‘బజరంగీ భాయిజాన్’ రెండవ భాగాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సల్మాన్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. SS రాజమౌళి, JR ఎన్టీఆర్, అలియా భట్, రామ్ చరణ్, కరణ్ జోహార్ సమక్షంలో ముంబైలో జరిగిన RRR ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ కొత్త సీక్వెల్‌ను ధృవీకరించారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్‌ సీక్వెల్‌ స్క్రిప్ట్‌ రాశారని సల్మాన్‌ వెల్లడించారు.

ఆర్‌ఆర్‌ఆర్ ఈవెంట్ సందర్భంగా, ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి తన కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకదాన్ని ఎలా ఇచ్చాడనే దాని గురించి మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ రివీల్ చేసాడు. దానికి చిత్రనిర్మాత కరణ్ జోహార్ స్పందిస్తూ, “ మీ సినిమా అధికారిక ప్రకటన నిజమా?” అని నటుడిని అడిగాడు. దానికి ప్రతిగా సల్మాన్, “అవును, కరణ్” అన్నాడు. బజరంగీ భాయిజాన్ భారతదేశంలోని బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ రోజు వరకు బాలీవుడ్ టాప్ 5 వసూళ్లలో ఒకటిగా ఉంది.

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ ‘బజరంగీ భాయిజాన్’కి సీక్వెల్ కోసం కథకు మెరుగులు దిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. “నేను బజరంగీ భాయిజాన్ 2ని స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయన్నారు. కొంతకాలం క్రితం నేను సల్మాన్‌కి చెప్పాను. అతను కూడా సంతోషిస్తున్నాడు. అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సరైన సమయం కోసం చూస్తున్నాను. అది కార్యరూపం దాల్చుతుందని ఆశిస్తున్నాను’ అని విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘బజరంగీ భాయిజాన్’లో కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 17 జూలై 2015న థియేటర్లలో విడుదలై కొత్త రికార్డులు తిరుగరాసింది.

  Last Updated: 20 Dec 2021, 11:44 AM IST