Salman Khan Gets Threat Mail: బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు ఈ-మెయిల్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఆఫీసుకు బెదిరింపు ఈ మెయిల్‌ వచ్చింది. నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan)కు బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మోహిత్ గార్గ్‌లపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

  • Written By:
  • Publish Date - March 20, 2023 / 07:41 AM IST

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఆఫీసుకు బెదిరింపు ఈ మెయిల్‌ వచ్చింది. నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan)కు బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మోహిత్ గార్గ్‌లపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నటుడు మేనేజర్, సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్ ఫిర్యాదు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ తర్వాత నటుడికి మెయిల్ వచ్చింది. ఇందులో గ్యాంగ్‌స్టర్ సల్మాన్‌ను చంపుతానని బహిరంగంగా బెదిరించాడు. ఓ టీవీ ఛానెల్‌కు లారెన్స్ బిష్ణోయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడిని చంపడమే తన జీవిత లక్ష్యమని చెప్పాడు.

బాంద్రా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. సల్మాన్ ఖాన్‌ కార్యాలయం ఉపయోగించే ఈమెయిల్ ఐడీకి శనివారం మధ్యాహ్నం బెదిరింపు మెయిల్ వచ్చింది. మోహిత్ గార్గ్ ID నుండి పంపబడిన ఇమెయిల్ లో.. గోల్డీ భాయ్‌ (గోల్డీ బ్రార్‌) నీతో ముఖాముఖి మాట్లాడాలనుకొంటున్నాడు. లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ మీరు తప్పక చూసి ఉంటారు, చూడకుంటే చూడమని చెప్పండి. వచ్చేసారి ఓ కుదుపు ఉంటుంది (నెక్స్ట్‌ టైమ్‌ ఝట్కా దేఖ్‌నేకో మిలేగా) అంటూ ఈ-మెయిల్‌ లో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ మేనేజర్ ప్రశాంత్ గుంజాల్కర్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఆదివారం గ్యాంగ్‌స్టర్లు గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లపై ఐపిసి సెక్షన్లు 120 (బి), 34, 506 (2) కింద కేసు నమోదు చేశారు. బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట భద్రతను పెంచారు.

Also Read: Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద కేసు

ఈమెయిల్ అందుకున్న గుంజాల్కర్, బాంద్రా పోలీసులను సంప్రదించారు. వారి ఫిర్యాదు మేరకు బిష్ణోయ్, బ్రార్, గార్గ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై బాంద్రా పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ బెదిరింపుల ఆధారంగా, ప్రభుత్వం ఇటీవల నటుడి భద్రతను పెంచింది. అతను ఇంతకుముందు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ రాడార్‌లో ఉన్నాడు. మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము.” అన్నారు. సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూన్‌లో నటుడి తండ్రి సలీం ఖాన్‌కు ఒక లేఖ వచ్చింది. అందులో సల్మాన్‌ను మూసేవాలా లాగే చంపేస్తానని రాశారు. ఆ కేసులో నటుడి ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదైంది.

ఇటీవల జైలు నుండి ఇచ్చిన ఇంటర్వ్యూలో లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ను చంపుతానని బెదిరించాడు. ప్రస్తుతం నేను గూండాని కాదు. సల్మాన్ ఖాన్‌ని చంపిన తర్వాత గూండాగా మారతాను. సల్మాన్ ఖాన్‌ని చంపడమే నా జీవిత లక్ష్యం. భద్రత తొలగిస్తే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాను అని అన్నాడు.