Tiger 3 : థియేటర్స్ లో క్రాకర్స్ కాల్చి రచ్చ చేసిన ఫ్యాన్స్.. స్పందించిన హీరో..

ఇండియాలో హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల మీద చాలా మందికి పిచ్చి అభిమానం ఉంటుంది. ఒక్కోసారి ఆ అభిమానం ముదిరి పిచ్చి పనులు కూడా చేయిస్తుంది. ఇక స్టార్ హీరోల అభిమానులు అయితే సినిమా రిలీజ్ అప్పుడు చేసే హంగామా అంతా ఇంత కాదు. బ్యానర్లు, కటౌట్స్, దండలు, థియేటర్ బయట క్రాకర్స్, డప్పులు, పాలాభిషేకాలు.. ఇలా చాలా హంగామా చేస్తారు. అయితే కొంతమంది అభిమానులు పిచ్చి అభిమానంతో థియేటర్ లోపల కూడా రచ్ఛ చేస్తున్న సంఘటనలు […]

Published By: HashtagU Telugu Desk
Salman Khan Fans Burst Crackers in Theater for Tiger 3 Movie

Salman Khan Fans Burst Crackers in Theater for Tiger 3 Movie

ఇండియాలో హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల మీద చాలా మందికి పిచ్చి అభిమానం ఉంటుంది. ఒక్కోసారి ఆ అభిమానం ముదిరి పిచ్చి పనులు కూడా చేయిస్తుంది. ఇక స్టార్ హీరోల అభిమానులు అయితే సినిమా రిలీజ్ అప్పుడు చేసే హంగామా అంతా ఇంత కాదు. బ్యానర్లు, కటౌట్స్, దండలు, థియేటర్ బయట క్రాకర్స్, డప్పులు, పాలాభిషేకాలు.. ఇలా చాలా హంగామా చేస్తారు.

అయితే కొంతమంది అభిమానులు పిచ్చి అభిమానంతో థియేటర్ లోపల కూడా రచ్ఛ చేస్తున్న సంఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మరోటి జరిగింది. సల్మాన్ ఖాన్(Salman Khan), కత్రినా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టైగర్ 3(Tiger 3). దీపావళి కానుకగా ఈ సినిమా నిన్న నవంబర్ 12న గ్రాండ్ గా రిలీజయింది. సినిమా రిలీజ్ సందర్భంగా సల్మాన్ అభిమానులు థియేటర్స్ వద్ద హంగామా చేస్తారన్న సంగతి తెలిసిందే.

అయితే మహారాష్ట్రలోని ఓ థియేటర్ లోపల సల్మాన్ అభిమానులు సినిమా స్టార్ట్ అయ్యాక హీరో ఎంట్రీ సీన్ లో క్రాకర్స్ కాల్చారు. థియేటర్స్ లో టపాసులు పేల్చి నానా రచ్చ చేశారు. దీంతో సినిమాకి వచ్చిన వాళ్ళు, థియేటర్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. దీనిపై అక్కడ గొడవ కూడా జరిగింది. ఇక థియేటర్స్ లో సల్మాన్ అభిమానులు క్రాకర్స్ కాల్చి చేసిన రచ్చ వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

ఈ విషయం సల్మాన్ వరకు వెళ్లడంతో సల్మాన్ తన సోషల్ మీడియాలో స్పందించాడు. సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. కొంతమంది టైగర్ 3 సినిమా సమయంలో థియేటర్ లోపల ఫైర్ వర్క్స్ కాల్చారని విన్నాను. ఇది చాలా ప్రమాదకరం. సినిమాని ఎంజాయ్ చేయండి. మీ లైఫ్ ని, పక్క వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టకండి అని పోస్ట్ చేశారు. దీంతో సల్మాన్ పోస్ట్ వైరల్ గా మారింది.

 

Also Read : Vijay Rashmika : విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలెబ్రేషన్స్? మరోసారి దొరికేశారు..

  Last Updated: 13 Nov 2023, 04:29 PM IST