Site icon HashtagU Telugu

Salman Khan: ఆ స్టార్ డైరెక్టర్ పై కోపంగా ఉన్న సల్మాన్ ఖాన్ అభిమానులు.. అసలేం జరిగిందంటే!

Salman Khan

Salman Khan

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ సరైన సక్సెస్ సినిమా అందుకొని చాలా కాలం అయింది. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత చలనచిత్ర డైరెక్టర్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు బాలీవుడ్ హీరోస్. ఇకపోతే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మురుగదాసు దర్శకత్వంలో, సికందర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ అభిమానులు దక్షిణ భారత దర్శకుడిపై కోపంగా ఉన్నారుట. జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కు భారీ హిట్ ఇచ్చిన అట్లీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ అభిమానులను ఆగ్రహానికి గురి కావడానికి ఒక కారణం ఉంది. జవాన్ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ తో ఒక కొత్త సినిమా తీస్తానని అట్లీ చెప్పాడు. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు చాలా సంతోషించారు. కానీ ఇప్పుడు అట్లీ అకస్మాత్తుగా తన నిర్ణయం మార్చుకుని అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఇదే సల్మాన్ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.

తనతో సినిమా తీస్తున్నాడనే కారణంతో నే సల్మాన్ ఖాన్ అట్లీ తెరకెక్కించిన హిందీ చిత్రం బేబీ జాన్ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. కానీ ఇప్పుడు చూస్తే, అట్లీ తన రూటు మార్చేశాడు. సల్మాన్ ఖాన్ కోసం తయారు చేసుకున్న కథతోనే అల్లు అర్జున్ సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందని, మైత్రి మూవీమేకర్స్ దీనిని నిర్మిస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి అట్లీ అల్లు అర్జున్ తో తెరకెక్కించబోయే కథ, సల్మాన్ ఖాన్ తో చేస్తానన్న కథ రెండు ఒకటేనా? లేదంటే అల్లు అర్జున్ మూవీ తర్వాత సల్మాన్ ఖాన్ తో సినిమా తీస్తారా ఈ విషయాలపై క్లారిటీ రావాలి అంటే అట్లీ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.