Site icon HashtagU Telugu

Salman Khan : డెంగ్యూ బారిన పడిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్…!!

Salman Khan

Salman Khan

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ డెంగ్యూ బారిన పడ్డారు. దీంతో రెండువారాల పాటు తన షూటింగ్ లన్నీ రద్దు చేసుకున్నారు. వీకెండ్ క వార్, బిగ్ బాస్ 16 షోలకు సల్మాన్ స్థానంలో కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈషోలతో పాటు సల్మాన్ ఖాన్ తాను నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కూడా రద్దు చేసుకున్నారు.  ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా షూటింగ్‌లో మధ్యలో ఉంది. ఇంతలోనే డెంగ్యూ బారిన పడటంతో ప్రస్తుతానికి షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాడు.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే, సల్మాన్ ఆరోగ్యం సహకరించకపోవడంతో అది వాయిదా పడింది. 2023 సంవత్సరంలో ఈద్ సందర్భంగా థియేటర్లలోకి రానుంది.

సల్మాన్ ఖాన్ ఈసారి బిగ్ బాస్ 16 వీకెండ్ క వార్‌ను షూటింగ్ లో పాల్గొనరని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సల్మాన్ స్థానంలో కరణ్ జోహార్‌ కనిపంచనున్నారు. కరణ్ కు బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. అతను 2021 సంవత్సరంలో బిగ్ బాస్ OTTని హోస్ట్ చేశాడు. అయితే, అప్పుడు కూడా, సోషల్ మీడియాలో, కరణ్ పై తెగ ట్రోల్స్ వచ్చాయి.