Salman and Pooja Hegde: పూజా హెగ్డే ఇంట్లో సల్మాన్ ఖాన్ సందడి.. ఫొటోలు వైరల్!

సల్మాన్ ఖాన్ (Salman Khan) టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde

Pooja Hegde

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. సాధారణంగా సల్మాన్ కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. కానీ పూజా హెగ్డే ఇంట్లో జరిగిన కార్యక్రమానికి అటెండ్ కావడం అందర్నీ షాక్ గురిచేసింది. పూజా హెగ్డే (Pooja Hegde) సోదరుడు రిషబ్ హెగ్డే వివాహ వేడుకకు హాజరయ్యారు. అనేక సోషల్ మీడియా ఫ్యాన్ క్లబ్‌లు సల్మాన్ పోజులిచ్చిన ఫొటోలను షేర్ చేశారు.

సల్మాన్ మ్యాచింగ్ ప్యాంట్‌తో నల్ల చొక్కా ధరించి మంచి మూడ్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. పూజా హెగ్డేతో కలిసిన తన పాట ‘చోటే చోటే భాయియోం కే బడే భయ్యా’ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో (Video) ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇటీవల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కు సల్మాన్ ఖాన్ ఒత్తిడి మేరకు తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈ జంట (Pair) ప్రైవేట్ ఫంక్షన్ లోనూ కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో మ్యాటర్ ఉందని నెటిజన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిల్మ్‌లో పూజా (Pooja Hegde), సల్మాన్ మొదటిసారి కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఇటీవల విడుదల చేసిన అధికారిక టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈద్ సందర్భంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. షారుఖ్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘పఠాన్’లో తన ప్రత్యేక పాత్రతో సల్మాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టైగర్ 3’ (Tiger3) లో నటి కత్రినా కైఫ్ సరసన కూడా కనిపిస్తాడు. ఇది దీపావళి 2023 సందర్భంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు పూజా ఇటీవల రణ్‌వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి ‘సర్కస్’ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Also Read: Byju’s Cuts Jobs: నష్టాల బాటలో బైజూస్.. ఉద్యోగులపై వేటు!

  Last Updated: 03 Feb 2023, 12:43 PM IST