బాలీవుడ్ కండలవీరుడికి వరుస బెదిరింపులు అనేవి ఆగడం లేదు. బాలీవుడ్ వెండితెర , బుల్లితెర పై రాణిస్తున్న సల్మాన్ ఖాన్ (Salman Khan) కు నిజ జీవితంలో మాత్రం ప్రశాంతగా అరనిమిషం కూడా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఎలాగైనా చంపేస్తాం అంటూ వరుసగా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా గ్యాంగ్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi) నుంచి ముంబై పోలీసులకు ఈ థ్రెట్ మెసేజ్ అందింది. ఈ వారంలో సల్మాన్ బెదిరింపులు రావడం ఇది మూడోసారి.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి కు సల్మాన్ కు సంబంధం ఏంటి..?
సల్మాన్ ఖాన్ కు మరియు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి కి మధ్య వివాదం 1998లో జరిగిన కృష్ణజింక వేట (Blackbuck hunting) కేసు తర్వాత ప్రారంభమైంది. లారెన్స్ బిష్ణోయి, బిష్ణోయి సమాజానికి చెందినవాడు. ఈ సమాజం కృష్ణజింకలను పవిత్రంగా భావిస్తుంది. ఎందుకంటే వారిలో జంతు సంరక్షణ పట్ల ఎంతో గాఢమైన భక్తి ఉంది. కృష్ణజింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌పై వారిలో తీవ్ర ఆగ్రహం నెలకొంది.
1998లో జోధ్‌పూర్‌లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకను వేటాడిన కేసులో అరెస్టు అయ్యాడు. ఈ కృష్ణజింక వేట బిష్ణోయి సమాజం నిషేధించిన చర్య, ఎందుకంటే ఈ జింకలను వారు తమ దేవతల సమానంగా భావిస్తారు. అలాంటి జింకలను సల్మాన్ వేటాడనే కోపంతో వారు అప్పటినుండి సల్మాన్ పై పగపట్టారు. సల్మాన్ ఖాన్ జింక వేటడి పెద్ద పాపం చేశారని వారు భవిస్తూ.. దీనికి గాను సల్మాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి లారెన్స్ బిష్ణోయి బృందం తరచూ సల్మాన్ కు బెదిరింపులు పంపుతూ వస్తున్నారు. 2023లో ఎక్కువగా ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ తన భద్రతను మరింత పెంచుకున్నాడు. అలాగే ఆయుధాల కోసం లైసెన్స్ కూడా పొందారు. ప్రభుత్వం కూడా ఈ బెదిరింపుల నేపథ్యంలో అదనపు పోలీస్ భద్రతను ఏర్పాటు చేసింది.