Site icon HashtagU Telugu

Salaar : హైదరాబాద్ లో సలార్ షో నిలిపివేత..ఆగ్రహం లో ఫ్యాన్స్

Salar Show Canceled In Mall

Salar Show Canceled In Mall

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ (Prabhas) – KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సలార్ (Salaar) లో శృతిహాసన్ హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితర నటులు కీలక పాత్రలో నటించారు. బాహుబలి2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సలార్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లే సినిమాను తెరకెక్కించారు. ఇక అర్ధరాత్రి నుండే తెలంగాణ లో సలార్ షోస్ మొదలు కావడం తో అభిమానుల సందడి మాములుగా లేదు. అయితే హైదరాబాద్లోని మల్లికార్జున థియేటర్లో సలార్ ప్రీమియర్ షోను నిర్వాహకులు నిలిపివేశారు. ఎక్కువ మంది థియేటర్లోకి రావడంతో షో వేయలేదు. దీంతో అభిమానులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. రద్దీని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు. షో ఎందుకు ఆపారంటూ వారంతా ఆవేశానికి గురయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగా.. సలార్ విడుదల రోజే రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సలార్ సినిమా విడుదల సందర్భంగా కరెంట్ షాక్‏తో ఓ అభిమాని మృతి చెందాడు. పట్టణంలోని రంగ థియేటర్‏ ఎదుట గురువారం ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాను బాలరాజు (27) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తమ అభిమాన హీరో నటించిన సలార్ సినిమా శుక్రవారం విడుదలకానుండడంతో ఫ్యాన్స్ అంతా ఎమోషనల్ అవుతున్నారు.

Read Also : Prabhas Salaar Review : రివ్యూ : సలార్ 1 సీజ్ ఫైర్