Salaar Booking: ఆగిపోయిన సలార్ అడ్వాన్స్ బుకింగ్.. నిరాశలో ఫ్యాన్స్

ఒకేసారి వందలాది మంది సైట్ ని ఓపెన్ చేసి టికెట్స్ బుక్ చేస్తుండటంతో సర్వర్ డౌన్ అయింది. అభిమానుల క్రేజ్ దృష్ట్యా సలార్ టికెట్ బుకింగ్ సైట్ క్రాష్ అయినట్లు మేకర్స్ చెప్తున్నారు.

Salaar Booking: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. శుక్రవారం 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్ తెరిచారు. దీంతో ఒకేసారి వందలాది మంది సైట్ ని ఓపెన్ చేసి టికెట్స్ బుక్ చేస్తుండటంతో సర్వర్ డౌన్ అయింది. అభిమానుల క్రేజ్ దృష్ట్యా సలార్ టికెట్ బుకింగ్ సైట్ క్రాష్ అయినట్లు మేకర్స్ చెప్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా టిక్కెట్లు చాలా వేగంగా అమ్ముడవుతున్నాయి. ఇంతలో టికెట్ బుకింగ్ సైట్‌లో అమ్మకాలు అకస్మాత్తుగా ఆగిపోయాయని తెలవడంతో ఫాన్స్ నిరాశ చెందుతున్నారు. తమ అభిమాన హీరో చిత్రాన్ని మొదటి రోజు చూడాలన్న కుతూహలంతో టికెట్ రేట్లను కూడా భేఖాతర్ చేస్తున్నారు.

సలార్ సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు బెని‌ఫిట్ షోలు వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. డిసెంబర్ 22న అంటే విడుదల తేదిన రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటలకు షోకు అనుమతినిస్తూ 6 షోలు వేసుకునే సదుపాయం కల్పించింది. అంతేకాకుండా 22న తేదిన తెల్లవారుజామున 1 గంటకు (అర్ధరాత్రి) సలార్ బెనిఫిట్ షో వేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20 థియేటర్లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. నైజాం ఏరియాలో మొత్తం 20 థియేటర్లలో అర్థరాత్రి ఒంటిగంటకు సలార్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఖుషి అవుతున్నారు.

ప్రభాస్, శ్రుతి హాసన్, జగపతి బాబు మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సలార్ సినిమాకి దాదాపు 6 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి. దీని ద్వారా ఈ సినిమా సుమారు రూ.12.41 కోట్లు రాబట్టింది. ఈ సినిమా బుకింగ్ ఇంకా కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది ట్రేడ్ నిపుణులు 2023 చివరి నాటికి ఈ చిత్రం ఈ సంవత్సరం బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రం అవుతుందని చెప్తున్నారు.

Also Read: China: చైనా భూకంపం మృతుల సంఖ్య 131కి చేరింది