Site icon HashtagU Telugu

Salaar: ఓపెనింగ్స్ లో సలార్ సరికొత్త రికార్డ్, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో బజ్

Salaar Teaser

Salaar

రాజమౌళి “RRR” యునైటెడ్ స్టేట్స్ లో మొదటి రోజు రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ఆ చిత్రం $5.5 మిలియన్ (ప్రీమియర్+మొదటి రోజు) అత్యధికంగా వసూలు చేసింది. చాలా నెలల పాటు యునైటెడ్ స్టేట్స్‌లో సత్తా చాటింది ఆర్ఆర్ఆర్. “సాలార్” సినిమా ఆర్ఆర్ఆర్ బాటలోనే నడుస్తోంది. ఈ మూవీకి బుకింగ్ ఓపెన్ చేయడంతో ఊహించని రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా సెప్టెంబర్ 27న అమెరికాలో ప్రీమియర్ షోలు వేయనుంది.అయితే, ఇప్పటికే $500k సేల్స్ సాధించింది. ప్రారంభ అమ్మకాల ద్వారా 3 నుండి 4 మిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రెండ్ ఫుల్ స్వింగ్ లో ఉంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం “సాలార్” గ్యాంగ్‌స్టర్ డ్రామా. సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌కి ఇదే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ప్రశాంత్ నీల్ బ్రాండ్ నేమ్ దానికి తోడ్పడుతోంది. ఈ చిత్రం సానుకూల వసూళ్లను పొందినట్లయితే, యునైటెడ్ స్టేట్స్లో వసూళ్లు “RRR”తో పోల్చవచ్చు. ప్రభాస్ నటించిన గత మూడు సినిమాలు అమెరికాలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.