Salaar Vs Dunki : షారుఖ్ కోసం ప్రభాస్‌కి షాక్ ఇచ్చిన పీవీఆర్.. కౌంటర్ ఇచ్చిన సలార్ నిర్మాతలు..?

ముఖ్యంగా నార్త్ లో సలార్ వర్సెస్ డంకీ భారీ క్లాష్ ఉంది.

Published By: HashtagU Telugu Desk
Salaar Vs Dunki war in Theaters PVR not giving Screens to Slaar in North Issue goes Viral

Salaar Vs Dunki war in Theaters PVR not giving Screens to Slaar in North Issue goes Viral

రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) హీరోగా తెరకెక్కిన డంకీ(Dunki) రేపు డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వస్తుంది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ వస్తుంది. అయితే డిసెంబర్ 21 ఎలాగో దేశమంతా డంకీకే థియేటర్స్ ఇస్తారు.

కానీ డిసెంబర్ 22 నుంచి మాత్రం థియేటర్స్ మాట్లాడుకున్న దాని బట్టి షేరింగ్ ఉంటాయి. ముఖ్యంగా నార్త్ లో సలార్ వర్సెస్ డంకీ భారీ క్లాష్ ఉంది. అయితే డంకీ నిర్మాతలు ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్-మిరాజ్ లతో మాట్లాడి, షారుఖ్ తో మాట్లాడించి ఎక్కువ థియేటర్స్, కుదిరితే వీరి ఆధ్వర్యంలో నడుస్తున్న సింగిల్ థియేటర్స్ అన్ని సలార్ ని తప్పించి డంకీ సినిమాకే కేటాయించాలని మాట్లాడారు.

దీంతో పీవీఆర్ డంకీ సినిమాకే నార్త్ లో ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తుంది. ముందు మాటాడుకున్న దాని బట్టి కూడా థియేటర్స్ ఇవ్వడం లేదని సలార్ నిర్మాతలకు తెలిసింది. అయితే షారుఖ్ డంకీ నార్త్ లో ఎంత హంగామా నడిచినా సౌత్ లో మాత్రం షారుఖ్ కి మార్కెట్ లేదు, అంతకు మించి ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అవుతుంది కాబట్టి సౌత్ లో ఎక్కువ మంది పట్టించుకోరు. దీంతో సౌత్ అంతా ప్రభాస్ హవానే. అందుకే సలార్ నిర్మాతలు పీవీఆర్ సంస్థ సౌత్ థియేటర్స్ లో సలార్ సినిమా రిలీజ్ చేయొద్దు అని ఆలోచిస్తున్నారట.

డిసెంబర్ 22న నార్త్ లో సలార్ కి పీవీఆర్ కేటాయించే థియేటర్స్ ని బట్టి ఇక్కడ సౌత్ లో పీవీఆర్ థియేటర్స్ లో సలార్ రిలీజ్ చేయాలా వద్దా అని నిర్మాతలు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దీంతో ఈ సినిమాల క్లాష్ కాస్త సౌత్ వర్సెస్ నార్త్ ట్రేడ్ గొడవగా మారుతుంది.

 

Also Read : EAGLE Trailer : రవితేజ ‘ఈగల్’ ట్రైలర్ చూశారా? ఈ సారి భారీ రేంజ్‌లో విధ్వంసం..

  Last Updated: 20 Dec 2023, 09:08 PM IST