Salaar Success Party : ప్రభాస్ ‘సలార్’ సక్సెస్ పార్టీ వీడియో చూశారా? అఖిల్ బాబు కూడా గెస్ట్ గా..

ఇప్పుడు సలార్ సక్సెస్ పార్టీ నుంచి వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Salaar Success Party hosted in Bengaluru Akkineni Akhil Guest Appearance Video goes Viral

Salaar Success Party hosted in Bengaluru Akkineni Akhil Guest Appearance Video goes Viral

మన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టాడు చాలా రోజుల తర్వాత. సలార్ సినిమా ఏకంగా 650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ సలార్ తోనే వచ్చింది. కలెక్షన్స్ కూడా బాహుబలి తర్వాత వచ్చిన సినిమాల కంటే కూడా దీనికే ఎక్కువ వచ్చాయి. దీంతో ప్రభాస్, చిత్రయూనిట్ తో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సలార్ సక్సెస్ పై చిత్ర నిర్మాతలు, హోంబలే నిర్మాణ సంస్థ కూడా సంతోషంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో చిత్రయూనిట్ వరకు ప్రైవేట్ పార్టీ ఇటీవల కొన్ని రోజుల క్రితం సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా బెంగుళూరులోని హోంబలే నిర్మాణ సంస్థ ఆఫీస్ లో సలార్ సక్సెస్ పార్టీ గ్రాండ్ గా చేసుకున్నారు. సినిమాలో నటించిన వాళ్ళు, సినిమాకి పనిచేసిన వాళ్ళతో పాటు పలువురు గెస్టులు కూడా వచ్చారు.

ఇప్పుడు సలార్ సక్సెస్ పార్టీ నుంచి వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హోంబలే ఆఫీస్ ని చూపించారు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే ఆఫీసుల్లాగా చాలా గ్రాండియర్ గా ఉంది. అలాగే చిత్రంలో నటించిన నటీనటులు, సినిమాకి పనిచేసిన వారు పార్టీకి వచ్చినట్టు చూపించారు. అయితే ప్రశాంత్ నీల్ బ్లాక్ అండ్ వైట్ ఫార్మేట్ ని అలాగే ఫాలో అవుతూ ఈ పార్టీ కూడా అంతా బ్లాక్ అండ్ వైట్ ఫార్మేట్ లోనే జరిగింది. పార్టీకి వచ్చిన వాళ్లంతా బ్లాక్ డ్రెస్సుల్లోనే రావడం గమనార్హం. దీంతో ఈ పార్టీ వీడియో వైరల్ గా మారింది.

అయితే ఈ పార్టీలో గెస్ట్ అప్పీరెన్స్ గా అఖిల్(Akhil Akkineni) కనపడ్డాడు. రిలీజ్ చేసిన పార్టీ గ్లింప్స్ లో అఖిల్ అయ్యగారు కూడా కనపడటంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ ఈ పార్టీకి ఎందుకు వచ్చాడు? ప్రభాస్ పిలిచాడా? లేదా ఎవరైనా పిలిచారా? అసలు సలార్ సినిమాతో అఖిల్ కి సంబంధం ఏంటి అని అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా పార్టీకి అఖిల్ చేతికి ఓ కట్టుతో వచ్చాడు. దీంతో అఖిల్ చేతికి ఏమైంది అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సలార్ సక్సెస్ పార్టీ వీడియోతో అఖిల్ కూడా వైరల్ అవుతున్నాడు.

Also Read : Prabhas : ప్రభాస్ పేరు మార్చుకున్న విషయం తెలుసా? ఇకపై ప్రభాస్ పేరు..?

  Last Updated: 16 Jan 2024, 03:39 PM IST