Site icon HashtagU Telugu

Salaar Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‍న్యూస్.. సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Salaar Release Date

Pravbas

Salaar Release Date: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, అందాల నటి శృతి హాసన్ ల తొలి కలయికలో మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ థ్రిల్లర్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వలన వాయిదా పడిన తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ మూవీ ని రానున్న డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు (Salaar Release Date) మేకర్స్ సిద్ధం అయినట్లు సోషల్ మీడియాలో సమాచారం అందుతుంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ ఫిక్సయినట్లుగా బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్‌లో చెప్పిన ప్రకారం ఈ సినిమా క్రిస్మస్ కానుకగా.. 22 డిసెంబర్ 2023న విడుదల కాబోతోందని తెలుస్తోంది. అయితే అదే రోజు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకీ’ విడుదల కూడా ఉండటంతో.. మరోసారి సలార్ విడుదలపై కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే మేకర్స్ మాత్రం ఇప్పుడు వినిపిస్తున్న డేట్‌కి సలార్ ని థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్సయ్యారని తెలుస్తోంది.

Also Read: Hero Karthi : అమ్మలేని ఇంట్లో ఉండటం నా వల్ల కావటం లేదంటూ..జ్యోతిక ఫై కార్తీ ఎమోషనల్ పోస్ట్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సలార్ రూపొందుతుంది. ఇప్పటికే వచ్చిన టీజర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్, యాక్షన్ అదిరిపోయాయి. సలార్ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‍ పాత్ర పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీకి రవి బస్సూర్ సంగీతం అందించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సలార్ విడుదల కానుంది.