Site icon HashtagU Telugu

Salaar OTT: ఓటీటీలో సందడి చేస్తున్న సలార్ మూవీ, నెటిజన్స్ రెస్పాన్స్ సూపర్

Another Heroine for Prabhas Fouji Imanvi and Mrunal Thakur

Another Heroine for Prabhas Fouji Imanvi and Mrunal Thakur

Salaar OTT: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వచ్చిన సలార్ మూవీ 20వ తేదీ (ఈరోజు) నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన నాలుగు వారాలకే నెట్ ఫ్లిక్స్ వేదికగా సలార్ స్ట్రీమింగ్ కావడం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం ఖర్చు చేసి ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడంతో విడుదలైన నాలుగు వారాలకే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్లలో సలార్ మూవీని చూసిన వాళ్లు సైతం ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

సలార్ (Salaar) మూవీ తక్కువ రోజుల్లోనే స్ట్రీమింగ్ అవుతుండటంతో ఇప్పటివరకు ఈ సినిమాను చూడని ప్రేక్షకులు సైతం సంతోషిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో సలార్ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఖాన్సార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సలార్ మూవీ ప్రభాస్ అభిమానులకు ఎంతగానో నచ్చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కు సైతం మంచి మార్కులు పడ్డాయి. 20వ తేదీ అర్ధరాత్రి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

అయితే, ఈ మూవీలో హిందీ వెర్షన్ మాత్రం ఇప్పుడు రావడం లేదు. హిందీ డబ్బింగ్ వచ్చేందుకు మరింత ఆలస్యం కానుంది. హిందీలో 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సలార్ హిందీ వెర్షన్ మార్చిలో వస్తుందని టాక్ ఉంది. హిందీ వెర్షన్‍పై నెట్‍ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. భారీ అంచనాల మధ్య సలార్ సినిమా గత డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంతో ప్రభాస్ మళ్లీ హిట్ బాటపట్టారు.