Prabhas Salaar : సలార్ ఫస్ట్ డే టార్గెట్ ఎంత..? రికార్డుల వేట మొదలైంది..!

ప్రభాస్ సలార్ (Prabhas Salaar) రికార్డుల వేట మొదలైంది. నాలుగు రోజుల్లో రిలీక్ కానున్న సలార్ సినిమా నేషనల్ వైడ్ గా టికెట్ బుకింగ్స్ ఓపెన్

  • Written By:
  • Updated On - December 18, 2023 / 10:42 AM IST

ప్రభాస్ సలార్ (Prabhas Salaar) రికార్డుల వేట మొదలైంది. నాలుగు రోజుల్లో రిలీక్ కానున్న సలార్ సినిమా నేషనల్ వైడ్ గా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో సలార్ సినిమా చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అడ్వాన్స్ బుకింగ్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. సలార్ సినిమా నార్త్ బెల్ట్ బుకింగ్స్ ఇలా ఓపెన్ అయ్యాయో లేదో అలా హౌస్ ఫుల్స్ కనబడుతున్నాయి. సలార్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ప్రశాంత్ నీల్, ప్రభాస్ క్రేజీ కాంబో సలార్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది. ఇక సినిమా నుంచి మరో ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేయనున్నారు. కె.జి.ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు.

Also Read : Samantha : సెకండ్ మ్యారేజ్ పై సమంత రియాక్షన్ ఏంటో తెలుసా..?

ఈ సినిమా ఫస్ట్ డే టార్గెట్ కూడా పెద్దగానే ఉందని తెలుస్తుంది. బాహుబలి 2 మొదటి రోజే 200 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన సాహో 120 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే భారీ హైప్ తో వస్తున్న సలార్ బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

మరి వారి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృధ్విరాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడంతో కన్నడ, మలయాళ పరిశ్రమల్లో కూడా సలార్ మీద తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తానికి ఈ సినిమా మరోసారి ప్రభాస్ స్టామినా ప్రూవ్ చేస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

We’re now on WhatsApp : Click to Join