Site icon HashtagU Telugu

Salaar First Day Collection : సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్..

Salaar Collections

Salaar Collections

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులే కాదు యావత్ సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ థియేటర్లలో ‘సలార్’ (Salaar) మూవీ ఘనంగా విడుదలైంది. ఎక్కడ చూసినా థియేటర్లు కిక్కిరిసి పోతున్నాయి. టికెట్స్ దొరకానివారు బ్లాక్ లో వెయ్యి రూపాయిలు పెట్టైనా తీసుకోనునేందుకు చూస్తున్నారు. ఇక థియేటర్స్ మొత్తం భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, అభిమానుల సందడితో సందడిగా మారాయి.

బాహుబలి (Baahubali) తర్వాత ప్రభాస్ నుండి అభిమానులు ఎదురుచూస్తున్న అసలు సిసలైన సినిమా పడకపోయేసరికి అందరి ఆశలు సలార్ పైనే ఉంది. దానికి తగ్గట్లే సినిమాను తెరకెక్కించడం , రిలీజ్ చేయడం చేసారు. ఇక సినిమా కు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో అంత ఫస్ట్ డే కలెక్షన్ల గురించి మాట్లాడుకోవడం మొదలుపెడుతున్నారు. ప్రస్తుతం సినీ వర్గాల నుంచి వస్తున్న లెక్కల ప్రకారం సలార్ సినిమా 170-180 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టేలా ఉంది. ఇదే జరిగితే 2023 డే 1 హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ (Salaar First Day Collections) విషయంలో ప్రభాస్ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసినట్లే. తక్కువలో తక్కువ 150 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టినా కూడా సలార్ సినిమా 2023 హయ్యెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటివరకు దళపతి విజయ్ నటించిన లియో 148 కోట్లతో టాప్ 1 ప్లేస్ లో ఉండగా… ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ ఆదిపురుష్ 137 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. జవాన్ 129 కోట్లు, అనిమల్ 115 కోట్లు, పఠాన్ 104 కోట్లు, టైగర్ 3 94 కోట్లు, జైలర్ 91 కోట్ల కలెక్షన్స్ ని ఓపెనింగ్ డే రోజున రాబట్టాయి. లియో రాకముందే వరకూ 2023 హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డ్ ఆదిపురుష్ పేరు పైనే ఉంది. ఇప్పుడు లియో టాప్ లో ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలి అంటే సలార్ సీజ్ ఫైర్ సినిమా 150 కోట్లకి పైగా కలెక్ట్ చేయాలి. 99% ఆకుపెన్సీ రేట్ మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా 150 కోట్లని కలెక్ట్ చేయడం పెద్ద కష్టంగా కనిపించట్లేదు. హిట్ టాక్ పడింది కాబట్టి ఈవెనింగ్, నైట్ షోస్ మరింత ప్యాక్ అవ్వడం గ్యారెంటీ.

Read Also : Salaar : ధర్మవరంలో విషాదం ..ప్రభాస్ అభిమాని మృతి