Prashanth Neel: నన్ను ఫాలో కావద్దు, నేను చేసిన తప్పు మీరు చేయవద్దు…. కెజిఎఫ్ డైరెక్టర్ ఇలా అనేశాడేంటి?

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 11:30 AM IST

దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు దర్శకత్వం వహించినది కేవలం 4 సినిమాలే అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట కన్నడలో ఉగ్రం సినిమాతో మంచం గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ ఆ తర్వాత కేజిఎఫ్ పార్ట్ వన్, పార్ట్ టు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా సలార్. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసింది నాలుగు సినిమాలే. ఈ నాలుగు సినిమాలు తీయడానికి ఆయనకు పదేళ్ల సమయం పట్టింది.

ఉగ్రం మూవీతో ప్రశాంత్ నీల్ దర్శకుడిగా మారారు. రెండో చిత్రమే పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశాడు. 2018లో విడుదలైన కెజిఎఫ్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. దానికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 అంతకు మించిన వసూళ్లు రాబట్టింది. కెజిఎఫ్ 2 దాదాపు రూ. 1200 కోట్లు కొల్లగొట్టింది. ఇక ప్రశాంత్ నీల్ నాలుగో చిత్రం సలార్. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ గత ఏడాది విడుదలైంది. అందుకు కారణాలు ఏమిటో వివరించిన ప్రశాంత్ నీల్… తాను చేసిన తప్పు మిగతావాళ్ళు చేయవద్దని అంటున్నాడు. కాగా ఇందులో ప్రభాస్-పృథ్విరాజ్ సుకుమారన్ మిత్రులుగా నటించారు. సలార్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వసూళ్లు రాబట్టింది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సలార్ 2 చేయనున్నారు.

అసలు కథ అంతా సలార్ 2 లోనే ఉంటుందట. షూటింగ్ కి కూడా సిద్ధం అవుతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ లాక్ చేశారట. సలార్ 2 అనంతరం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేశాడు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ ఉగ్రం తెరకెక్కించడానికి ఏకంగా నాలుగేళ్లు సమయం పట్టిందట. అయితే సుభాష్ రెడ్డి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. కొన్నేళ్ల క్రితమే ప్రశాంత్ నీల్ తండ్రి చనిపోయారు. ఆయనను నీలకంఠాపురం లోనే అంత్యక్రియలు చేసి మెమోరియల్ కూడా కట్టారు. అప్పుడప్పుడు నీల్ తన హోమ్ విలేజ్ కు ఫ్యామిలీతో పాటు వచ్చి వెళ్తుంటాడట.ఇక కేజీఎఫ్ 2 రిలీజ్ రోజు కూడా ప్రశాంత్ నీల్ ఈ గ్రామానికి వచ్చిన తన తండ్రి సమాధిదగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వెళ్లాడట. ప్రశాంత్ నీల్ కి ఎలాంటి అనుభవం లేదట. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదట. కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదట.

డైరెక్ట్ గా మెగా ఫోన్ పట్టే ఛాన్స్ వచ్చింది. అయితే అనుభవం లేకపోవడం వలన ఉగ్రం పలుమార్లు రీ షూట్ చేశారట. సినిమా ఎలా తీయాలో నేర్చుకుని తెరకెక్కించే నాటికి చాలా సమయం పట్టిందట. ఉగ్రం షూటింగ్ ఆలస్యం కావడంతో చిత్ర యూనిట్ తో పాటు తాను కూడా ఒత్తిడికి గురయ్యాడట. ఆరు నెలల్లో పూర్తి కావాల్సిన సినిమా నాలుగేళ్ల సమయం తీసుకుందట. కాబట్టి ఈ విషయంలో నన్ను ఫాలో కావద్దు. నేను చేసిన మిస్టేక్ మీరు చేయవద్దు. అసిస్టెంట్ గా పని నేర్చుకుని తర్వాత సినిమా తెరకెక్కించండి అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు.