పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో నటించిన సలార్ (Salaar) మూవీ తాలూకా ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
మూడు రోజుల కలెక్షన్స్ చూస్తే..
నైజాంలో రూ. 10.97 కోట్లు
సీడెడ్‌లో రూ. 3.20 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 2.73 కోట్లు
ఈస్ట్ గోదావరిలో రూ. 1.41 కోట్లు
వెస్ట్ గోదావరిలో రూ. 85 లక్షలు
గుంటూరులో రూ. 1.20 కోట్లు
కృష్ణాలో రూ. 1.27 కోట్లు
నెల్లూరులో రూ. 77 లక్షలతో.. రూ. 22.40 కోట్లు షేర్, రూ. 35.65 కోట్లు గ్రాస్ వసూలు రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే..
తమిళంలో రూ. 5.80 కోట్లు
కర్నాటకలో రూ. 13.35 కోట్లు
కేరళలో రూ. 4.05 కోట్లు
హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 29.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 38.80 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 185.67 కోట్లు షేర్, రూ. 330 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక సలార్ దెబ్బకు షారుఖ్ నటించిన డంకీ సినిమాకు ఏమాత్రం కలెక్షన్లు రావడం లేదు. అసలే టాక్ అంతంత మాత్రంగా వచ్చిన ఈ చిత్రానికి సలార్ రూపంలో గట్టి దెబ్బ పడింది.
Read Also : Neha sharma : క్లివేజ్ తో మతులు పోగొడుతున్న చిరుత బ్యూటీ నేహా శర్మ