Site icon HashtagU Telugu

Agent: ‘ఏజెంట్’ బ్యూటీ సాక్షి వైద్య లుక్ ఇదే!

Sakshi Vidhya

Sakshi Vidhya

యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్. స్టయిలీష్ స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘ఏజెంట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ లో అడుగుపెడుతుంది. సాక్షి వైద్య పుట్టిన రోజు సందర్భంగా ఆమె స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

బర్త్ డే స్పెషల్ పోస్టర్ లో.. లవ్లీ స్మైల్ తో క్రాప్డ్ స్వెట్ షర్ట్, జీన్స్ లో చాలా అందంగా, స్టయిలీష్ గా కనిపించింది సాక్షి వైద్య. కూల్ అండ్ ప్లజంట్ గా కనిపించి అందరి ద్రుష్టిని ఆకర్షించింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమౌతుంది.

Exit mobile version