Site icon HashtagU Telugu

Saindhav Talk : సైంధవ్ మూవీ టాక్..ఓకే ‘మామ’

Saindhav Talk

Saindhav Talk

ఫ్యామిలీ హీరో వెంకటేష్ (Venkatesh) నుండి ఇటీవల కాలంలో గొప్ప చిత్రాలేవీ పడలేదు..ఈ క్రమంలో ఆయన అభిమానులంతా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పడితే బాగుండు అని అనుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో తన 75 వ చిత్రాన్ని ప్రకటించి అభిమానుల్లో అంచనాలు పెంచారు.శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకటేష్, శ్రద్దా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్దిఖీ ఇలా భారీ తారాగణంతో సైంధవ్ (Saindhav ) మూవీ ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ ను ప్రకటించడం..ట్రైలర్ సైతం కొత్తగా ఉండే సరికి సినిమా ఫై అంచనాలు మొదలయ్యాయి. దానికి తగ్గట్లే ప్రమోషన్ కార్యక్రమాలు చేసి ఆసక్తి పెంచారు వెంకీ.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు ( జనవరి 13న) ఈ మూవీ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియా లో ఉదయం ఆట తో సందడి మొదలైనప్పటికీ ఓవర్సీస్ లో అర్ధరాత్రే షోస్ పూర్తి చేసుకుంది. దీంతో సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు
సినిమాకు మిక్సిడ్ టాక్ వినిపిస్తుంది. కొంతమంది సినిమా బాగుందని అంటుంటే..కొంతమంది బీలో యావరేజ్ అంటున్నారు. సినిమా స్లో గా సాగిందని , బోరింగ్ గా సాగిందని అంటున్నారు. అభిమానులు మాత్రం వెంకీ యాక్షన్ సూపర్బ్ అని , నవాజుద్దీన్ సిద్ధిఖి యాక్టింగ్ మరో లెవల్ అంటున్నారు. ఓవరాల్ గా మాత్రం జస్ట్ ఓకే అని మాత్రం గట్టిగా చెపుతున్నారు.

ఇప్పటికే సంక్రాంతి బరిలో వచ్చిన గుంటూరు కారం , హనుమాన్ మూవీస్ లలో గుంటూరు కారం కు నెగిటివ్ టాక్ రాగా ..హనుమాన్ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్స్ పెంచుకునేపనిలో పడింది. మరి వెంకీ పరిస్థితి ఏంటి అనేది కాసేపట్లో తెలియనుంది. రేపు నాగార్జున నా సామిరంగా తో రాబోతున్నాడు. దాని భవిష్యత్ ఎలా ఉంటుందో..

Read Also : Allari Priyudu : ‘అల్లరి ప్రియుడు’ చేయనన్న రాజశేఖర్.. కానీ దర్శకేంద్రుడు..

Exit mobile version