Saindhav: విక్టరీ వెంకటేష్ సైంధవ్ స్టోరి కాపీనా..?

విక్టరీ వెంకటేష్‌ కెరీర్ లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అయిన 75వ చిత్రం సైంధవ్. ఈ చిత్రాన్ని హిట్, హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

Saindhav: విక్టరీ వెంకటేష్‌ కెరీర్ లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అయిన 75వ చిత్రం సైంధవ్. ఈ చిత్రాన్ని హిట్, హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. షూటింగ్ స్టార్ట్ చేయకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం.. స్పెషల్ వీడియో ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సైంధవ్ మూవీ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు కథ ఏంటి అనేది రివీల్ చేయలేదు.

అయితే.. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో కథ ఎలా ఉండబోతుందనేది క్లియర్ గా చెప్పేశారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి ఇన్ స్పిరేషన్ ఏంటి..? హాలీవుడ్ మూవీ కాపీనా డౌట్ స్టార్ట్ అయ్యింది. ఇదే విషయం గురించి డైరెక్టర్ శైలేష్ ను అడిగితే.. హాలీవుడ్ లో వచ్చిన ఈక్వైలైజర్, టేకెన్ లాంటి సినిమాలు ఈ సినిమాకి స్పూర్తి అని చెప్పారు. హాలీవుడ్ హీరోలు తమ వయసుకు తగ్గ యాక్షన్ కథలు చేస్తున్నప్పుడు మన సీనియర్ హీరోలతో కూడా అలాంటి సినిమాలు చేస్తే యూత్ లైక్ చేస్తుంది కదా అనిపించింది. సరిగ్గా ఆ ఆలోచనల్లో ఉన్నప్పుడు వెంకీ గారు పిలిచి ఈ అవకాశం ఇచ్చారని శైలేష్ చెప్పారు.

ఇందులో వెంకటేష్ గారు ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారని.. అయితే.. ఈ సినిమాకి హాలీవుడ్ మూవీస్ స్ఫూర్తి మాత్రమే కానీ.. కథ మాత్రం తనదే అని.. కొత్తగా ఉంటుందన్నారు శైలేష్. పవర్ ఫుల్ హీరో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కి డాటర్ ఉండడం.. ఆ డాటర్ కి ప్రాబ్లమ్ ఉండడం.. ఇలాంటి కథలు కొన్ని వచ్చాయి కానీ.. అంతగా ఆకట్టుకోలేకపోయాయి. నాగార్జున, వర్మ కాంబోలో వచ్చిన ఆఫీసర్ మూవీ కూడా టేకెన్ స్పూర్తితో వచ్చిందే. ఆ సినిమా ఏమాత్రం ఆడలేదు. మరి.. వెంకీ సైంధవ్ సక్సెస్ సాధిస్తుందో లేదో.

Also Read: SP Balasubrahmanyam : మొదటి పారితోషికం అందుకోగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏం చేశారో తెలుసా..?