Game Changer : శైలేష్ కొలను దర్శకత్వంలో గేమ్ ఛేంజర్.. వైజాగ్ షెడ్యూల్‌ పిక్ వైరల్..

దర్శకుడు శంకర్ ఇండియన్ 2ని పూర్తి చేసి ఫుల్ ఫోకస్ గేమ్ ఛేంజర్ పై పెట్టిన సంగతి తెలిసిందే. అయినాసరి ఈ మూవీని శైలేష్ కొలను..

  • Written By:
  • Publish Date - June 14, 2024 / 12:30 PM IST

Game Changer : తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత ఈ సినిమాతో రామ్ చరణ్.. శంకర్ తో జతకట్టడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ ఏమో గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాతో పాటు శంకర్ ఇండియన్ 2ని కూడా చిత్రీకరిస్తుండడంతోనే గేమ్ ఛేంజర్ లేట్ అవుతూ వచ్చింది.

ఇది ఇలా ఉంటే, ఈ మూవీని శంకర్ కాకుండా తెలుగు దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు గురించి శైలేష్ ని ప్రశ్నించగా.. తాను డైరెక్ట్ చేసిన మాట నిజమే అని, కానీ అవి ఇంపార్టెంట్ సీన్స్ కాదని, కేవలం వాహనాలు మరియు ఎయిర్ పోర్ట్, సిటీస్ లాంగ్ షాట్స్ అని చెప్పుకొచ్చారు. దర్శకుడు శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉండడం వలనే.. శైలేష్ ఈ సీన్స్ ని చిత్రీకరించాల్సి వచ్చింది.

అయితే ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2ని పూర్తి చేసి ఫుల్ ఫోకస్ గేమ్ ఛేంజర్ పై పెట్టారు. శంకర్ వచ్చినప్పటికీ కొన్ని సీన్స్ ని శైలేష్ కోలనే డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ రామ్ చరణ్ పై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే కేవలం చరణ్ సీన్స్ మాత్రమే కాకుండా, వైజాగ్ లో చేయవల్సిన కొన్ని సీన్స్ ని కూడా ఒకే సమయంలో చేస్తున్నారట.

మల్టీపుల్ టీమ్స్ ని పెట్టి ఒకే సమయంలో వైజాగ్ లోని పలు ప్రాంతాలు షూటింగ్ ని జరుపుతున్నారట. ఈక్రమంలోనే ఒక సెట్ లో శైలేష్ కొలను పాల్గొని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో రామ్ చరణ్ టాకీ పార్ట్ అంతా పూర్తీ అవుతుందట.