Saif Ali Khan: మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి.. మీడియాపై సైఫ్ ఫైర్!

వివిధ ఫంక్షన్లు, సినిమా షూటింగ్స్ లో కనిపించినప్పుడు ఇష్టమైన హీరోహీరోయిన్స్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడటం కామన్.

Published By: HashtagU Telugu Desk
Saif

Saif

స్టార్స్ సెలబ్రిటీస్ (Celebraties) అంటే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది. వివిధ ఫంక్షన్లు, సినిమా షూటింగ్స్ లో కనిపించినప్పుడు ఇష్టమైన హీరోహీరోయిన్స్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడటం కామన్. ఇక ఫొటోగ్రాఫర్లదీ అదే పరిస్థితి. నచ్చిన యాంగిల్స్ ఫొటోలు తీస్తూ సందడి చేస్తుంటారు. ఫొటోల కోసం గంటల తరబడి వెయిట్ కూడా చేస్తుంటారు. అయితే ఈ మధ్య ఫొటోగ్రాఫర్ల తాకిడి ఎక్కువ కావడంతో స్టార్స్ సైతం సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), కరీనా కపూర్ ఖాన్ మలైకా-అమృత అరోరా తల్లి జాయిస్ 70వ పుట్టినరోజు వేడుకలో స్టైలిష్ గా కనిపించారు.

బర్త్ డే (Birthday) వేడుకల్లో ఈ జంట ఆకట్టుకోవడంతో ఫొటోగ్రాఫర్లు మరిన్ని ఫొటోలు తీయాలని వారిని ఫాలో అయ్యారు. అయితే అసహనమో, లేక ఆట పట్టించాలనో కానీ సైప్ మాత్రం సంచలన కామెంట్స్ చేశారు. “ఏక్ కామ్ కరియే, హుమారే బెడ్‌రూమ్ మే ఆ జైయే (ఒక పని చేయండి, మా బెడ్‌రూమ్‌ (Bedroom)కు మమ్మల్ని అనుసరించండి) అని చెప్పాడు (Saif Ali Khan).

అప్పుడు ఫోటోగ్రాఫర్‌లలో ఒకరు “సైఫ్ సర్, హమ్ ఆప్సే ప్యార్ కర్తే హై (సైఫ్ సర్, మేము నిన్ను ప్రేమిస్తున్నాము)” అని అన్నాడు, దానికి సైఫ్, “హమ్ భీ ఆప్సే ప్యార్ కర్తే హై (మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాము)” అని బదులిచ్చాడు. అయితే సాధారణంగా స్పందించని సైఫ్ అలీ ఖాన్ మాత్రం సీరియస్ గా రియాక్ట్ కావడం ఫొటోగ్రాఫర్లతో పాటు బాలీవుడ్ యాక్టర్స్ ను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం సైఫ్ Saif Ali Khan కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: Arudra wife: దిగ్గజ కవి ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మీ కన్నుమూత

  Last Updated: 03 Mar 2023, 06:33 PM IST