Site icon HashtagU Telugu

Bollywood Stars: సైఫ్ అలీ ఖాన్‌కు ‘హై-లెవల్’ భద్రత ఉందా? ఈ బాలీవుడ్ స్టార్ల‌కు X, Y+ భద్రత!

Bollywood Stars

Bollywood Stars

Bollywood Stars: నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి ఘటనతో బాలీవుడ్‌ (Bollywood Stars) ఇండస్ట్రీ మొత్తం ఆందోళనకు దిగింది. దీంతో పాటు బాలీవుడ్ న‌టుల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో సైఫ్‌పై దాడి తర్వాత నటుడికి హై లెవెల్ సెక్యూరిటీ ఇస్తారా అనే ప్రశ్న ప్రజల మదిలో వస్తోంది. ఇంతకు ముందు కూడా చాలా మంది న‌టుల‌కు ప్రాణ‌హాని బెదిరింపులు వచ్చాయి. అయితే కొంత‌మంది బాలీవుడ్ తార‌ల‌కు X, Y, Z+ భద్రత ఉంది. న‌టుల‌కు ఏ భద్రత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

హై లెవెల్‌ భద్రత

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగినప్పటి నుండి అతని భద్రతపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నటుడికి ప్రభుత్వ భద్రత లభిస్తుందా లేదా అనే ఊహాగానాలు కూడా మొద‌ల‌య్యాయి. అయితే దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నివేదికల ప్రకారం.. నటుడికి ‘హై లెవల్ సెక్యూరిటీ’ లభిస్తుందని స‌మాచారం.

Also Read: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఇందుకేనా?

ఏ స్టార్ల‌కు ‘అధిక స్థాయి భద్రత’ ఉంది

సల్మాన్ ఖాన్

ఈ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్ పేరు మొదటి స్థానంలో ఉంది. సల్మాన్ ఖాన్‌కు ఇప్పటికే హై లెవల్ సెక్యూరిటీ ఉంది. అయితే గతేడాది బాబా సిద్ధిఖీ హత్య తర్వాత నటుడి భద్రతను పెంచారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు రావడంతో సల్మాన్ ఖాన్‌కు వై+ భద్రత కల్పించారు.

షారుక్ ఖాన్

ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా అంటే షారుక్ ఖాన్ పేరు కూడా ఉంది. షారుక్ ఖాన్‌కు కూడా హై లెవల్ సెక్యూరిటీ ఉంది. ‘పఠాన్‌’, ‘జవాన్‌’ సినిమాలు చేసిన తర్వాత చంపేస్తామని ఆయ‌న‌కు బెదిరింపులు రావడంతో నటుడికి Y+ భద్రత కల్పించారు.

అక్షయ్ కుమార్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. నటుడు అక్షయ్ కుమార్‌కు హత్య బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఎక్స్+ భద్రతను కల్పించింది.

అనుపమ్ ఖేర్

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం విడుదలైన తర్వాత X+ భద్రతను పొందారు. నటుడికి 2022 సంవత్సరంలో హత్య బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత అతని భద్రతను పెంచారు.

కంగనా రనౌత్

ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ పేరు కూడా వచ్చింది. 2020 సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం.. శివసేనతో ఘర్షణ తర్వాత నటికి మోదీకి ప్రభుత్వం Y+ భద్రతను ఇచ్చింది.