బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి (Attack) జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 16న ముంబైలోని తన నివాసంలో దొంగతనం ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో ఆయనపై దుండగుడు కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో సైఫ్‌కు తీవ్ర గాయాలవడంతో వెంటనే లీలావతి ఆస్పత్రి లో జాయిన్ అయ్యాడు. వైద్యులు ఆయనకు రెండు సర్జరీలు చేసినట్లు ప్రకటించారు. ఈ దాడిలో సైఫ్ వెన్నులో 2.5 ఇంచుల కత్తి ముక్క చొచ్చుకుపోయిందని వైద్యులు తెలిపారు. దీనిని తొలగించేందుకు సర్జరీ చేసారు.
Trumps First Speech : ప్రవాస భారతీయులకు షాక్.. ట్రంప్ కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్
గత వారం రోజులుగా హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ వస్తున్న సైఫ్..ప్రస్తుతం కోలుకోవడం తో కాసేపట్లో డాక్టర్స్ డిశ్చార్జ్ (Discharge) చేయబోతున్నారు. అటు ఈ దాడికి పాల్పడిన నిందితుడు మహ్మద్ షరీఫు ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్ నివాసంలో జరిగిన ఘటనను కైమ్సిన్ రీక్రియేషన్ ద్వారా వివరాలను సేకరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ దాడి అనంతరం బాలీవుడ్ ప్రముఖులు సైఫ్ కుటుంబానికి మద్దతు తెలుపుతూ..ఎప్పటికప్పుడు సైఫ్ ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటూ వచ్చారు.