Site icon HashtagU Telugu

Devara : దేవర నుంచి భైరవ గ్లింప్స్ వచ్చేసింది..

Saif Ali Khan, Ntr, Devara, Devara Glimpse

Saif Ali Khan, Ntr, Devara, Devara Glimpse

Devara : ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో భారీ స్టార్ కాస్ట్ కనిపించబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. నేడు ఈ నటుడు పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్.. మూవీ నుంచి కొత్త గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ భైరవ పాత్రలో నటిస్తున్నారు.

ఎటువంటి డైలాగ్ లేకుండా రిలీజ్ చేసిన గ్లింప్స్ యాక్షన్ పార్ట్ తో ఆకట్టుకుంటుంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. మూవీలో భైరవ పాత్ర చాలా క్రూరంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక వీడియో విజువల్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నాయి. ఈ గ్లింప్స్ తో మూవీ పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఆ గ్లింప్స్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను దేవర అందుకుంటుందా లేదా చూడాలి.