బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విడాకుల ( Saif ali Khan and Kareena Kapoor Divorce ) వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. సైఫ్ తన భార్య కరీనా కపూర్‌కు విడాకులు ఇవ్వనున్నారని, వీరి వివాహ బంధం ముగిసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.
India Test Vice Captain: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా బుమ్రా.. మరీ వైస్ కెప్టెన్ సంగతేంటి?
తాజాగా ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా, సైఫ్ అలీ ఖాన్ తన చేతిపై ఉన్న కరీనా పేరుతో ఉన్న టాటూను తొలగించడం తో విడాకులు నిజమే కావొచ్చని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. గతంలో ప్రేమను చాటుకునేందుకు కరీనా పేరుతో టాటూ వేయించుకున్న సైఫ్, ఇటీవల దాన్ని తీసేయడం గమనార్హం. అంతేకాదు తాజా ఫొటోల్లో త్రిశూలం ఆకారంలో కొత్త టాటూ కనిపించడంతో వీరి మధ్య విబేధాలు తీవ్రమయ్యాయని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతే కాదు కరీనా కపూర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్, వీరి విడాకుల వార్తలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. “పెళ్లిళ్లు, విడాకులు, పిల్లల పెంపకం.. ఇవన్నీ మన జీవితంలో రాకముందు అర్థం చేసుకోలేం. అనుభవమే మనకు నిజమైన పరిజ్ఞానం ఇస్తుంది” అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అభిమానులందరిలోనూ కొత్త చర్చకు దారి తీసింది. ఈ పోస్ట్ ద్వారా కరీనా, తన వ్యక్తిగత జీవితం గురించి హింట్ ఇచ్చిందని, త్వరలోనే విడాకుల ప్రకటన రావొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. చూద్దాం మరి ఏంజరగబోతుందో..!!
