Sai Dharam Tej: సాయి తేజ్ విరూపాక్ష టీజర్ విడుదల.. మాములుగా లేదుగా!

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. సుకుమార్ ఈ సినిమా కథని అందిస్తున్నారు. అతడి శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమా చేస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 03 02 At 20.30.47 (1)

Whatsapp Image 2023 03 02 At 20.30.47 (1)

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. సుకుమార్ ఈ సినిమా కథని అందిస్తున్నారు. అతడి శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ని మార్చి 1న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రావూరి పండు గుండె పోటుతో మృతి చెందడంతో.. టీజర్ రిలీజ్ ని పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా నేడు ఈ టీజర్ ని విడుదుల చేసారు.

మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఆడియన్స్ లో మూవీ పై క్యూరియాసిటీని క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పుడు టీజర్ తో సినిమా పై అంచనాలు అమాంతం పెరిగేలా చేశారు. ఈ చిత్రం మిస్టికల్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఇక టీజర్ బట్టి చూస్తే.. ఒక గ్రామంలో క్షుద్రశక్తి పూజలు చేసే ఒక అజ్ఞాత వ్యక్తి వలన ఊరిలో అంతుచిక్కని రీతిలో మరణాలు జరుగుతుంటాయి. ఆ మరణాలు ఎవరు చేస్తున్నారో తెలియక ఊరు మొత్తం భయపడుతుంది. ఇక ఆ మరణాలకు కారణం అవుతున్న వ్యక్తిని హీరో ఎలా కనిపెట్టాడు, ఆ దారిలో తనకి ఎలాంటి సమస్యలు ఎదురైని అనేది మూవీ కథ అని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.

డైలాగ్స్ కూడా సినిమాకు అట్రాక్షన్ లా కనిపిస్తోంది. చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి, సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే వెతకాలి.. ఆ ప్రమాదం దాటడానికి నా ప్రయాణం వంటి డైలాగ్స్ ఇంటరెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హై లైట్ గా నిలిచింది.

ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, రాజీవ్ కనకాల, జాన్సీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.

  Last Updated: 02 Mar 2023, 08:33 PM IST