Site icon HashtagU Telugu

Sai Dharam Tej: తల్లి మీద ప్రేమతో పేరు మార్చుకున్న సాయి తేజ్.. కొత్త పేరు అదే?

Mixcollage 09 Mar 2024 11 08 Am 9355

Mixcollage 09 Mar 2024 11 08 Am 9355

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి మన అందరికి తెలిసిందే. సాయి ధరమ్ తేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు సాయి తేజ్. ఇది ఇలా ఉంటే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కీలక ప్రకటన చేశాడు. అమ్మపై తనకున్న ప్రేమకు ప్రతీకగా తన పేరును మార్చుకుంటున్నట్లు వెల్లడించారు.

తన పేరులో తన తల్లి పేరు కూడా ఉండేలా కొత్త పేరును ప్రకటించాడు. వుమెన్స్ డే స్పెషల్ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ఒక సినీ ఈవెంట్ లో ఈ కీలక ప్రకటన చేశాడు తేజ్. ఎప్పటి నుంచో అమ్మ పేరు మీద ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభిద్దామనుకుంటున్నాను. అది సత్య షార్ట్‌ ఫిల్మ్ తో సాధ్యమైంది. మా అమ్మ పేరు మీద విజయ దుర్గ ప్రొడక్షన్స్‌ ప్రారంభించాను. ఇవాళ్టి నుంచి, ఇప్పటినుంచే నా పేరులో మా అమ్మ పేరును కూడా చేర్చుకుంటున్నాను. మా అమ్మ నాతోటే ఉండాలి. అందుకే మా అమ్మ పేరు కూడ చేర్చుకుని నా పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నాను అని తేజ్‌ చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలోనూ తన కొత్త పేరును అప్డేట్ అప్డేట్ చేయబోతున్నట్లు తెలిపారు సాయి తేజ.

ఇకపోతే సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయాలు వస్తే.. సాయి ధరమ్ తేజ్, స్వాతి జంటగా నటించిన షార్ట్ ఫిల్మ్ సత్య. తాజాగా దీని ప్రీమియర్ ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తేజ్. నా లైఫ్ లో ముగ్గురు సత్యలు ఉన్నారు. మా అమ్మ, పిన్ని, అమ్మమ్మ అంజనాదేవి. వాళ్లు నన్ను దగ్గరకు తీసుకుని ఎంతో ఆప్యాయంగా పెంచారు. వాళ్లను నేను సంతోషంగా ఉంచడం తప్ప ఇంకేమీ చేయలేను. నేను గొప్పగా ఉంటే వాళ్లకే సంతోషం అని ఎమోషనల్ అయ్యాడు తేజ్‌. ఇక యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ నటించిన విరూపాక్ష, బ్రో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు సాయి దుర్గ తేజ్.