Sai Pallavi: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లలో సాయి పల్లవి ఒక్కరు. ఆమె అసాధారణమైన నటనా సామర్థ్యం, ఆకర్షణీయమైన ప్రతిభ ఎంతోమంది అభిమానులను సంపాదించేలా చేసింది. ఆమె చేసే ప్రతి పాత్ర ఎంతో సహజంగా, ఆసక్తిగా ఉంటుంది. అందుకే సాయిపల్లవి అంటే అభిమానుల్లో ఫుల్ క్రేజ్. ‘మిడిల్-క్లాస్ అబ్బాయి’, ‘మారి 2’, ‘ఫిదా’, ‘శ్యామ్ సింఘా రాయ్’ లాంటి సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ సహజ నటి.
ప్రస్తుతం ఈ బ్యూటీ చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య తో కలిసి NC23 మూవీలో నటిస్తోంది. ప్రొడక్షన్ హౌస్, గీతా ఆర్ట్స్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా సాయి పల్లవి NC23 తారాగణంలో చేరినట్లు అధికారికంగా తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా సాయిపల్లవి తన రెమ్యూనరేషన్ పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్యతో కలిసి నటిచేందుకు (NC23) భారీగా డిమాండ్ చేసిందట.
సాయిపల్లవి నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ (2021)లో కనిపించింది. అందుకోసం ఆమె రూ.2 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం.. సాయి పల్లవి తన ఫీజును 30% పెంచింది. NC23 కోసం ఆమె Rs2.6cr నుండి 3cr వరకు డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్ట్‌లోని మహిళా ప్రధాన పాత్రకు పల్లవి మాత్రమే న్యాయం చేయగలదని మేకర్స్ భావిస్తున్నారు. సో సాయిపల్లవి అడిగిన రెమ్యూనరేషన్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
Also Read: Dog Bites: దడ పుట్టిస్తున్న రేబీస్.. ఒకే ఏడాదిలో 307 మంది మృతి