Sai Pallavi : సాయి పల్లవి కొత్త రికార్డు.. రెండేళ్లలో నాలుగు ఫిలింఫేర్..

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి మరో కొత్త రికార్డు. వరుసగా రెండేళ్లలో నాలుగు ఫిలింఫేర్ అవార్డులను..

Published By: HashtagU Telugu Desk
Sai Pallavi, South Filmfare Award, Gargi, Virata Parvam

Sai Pallavi, South Filmfare Award, Gargi, Virata Parvam

Sai Pallavi : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చేసిన సినిమాలు కంటే ఆమె అందుకున్న అభిమానం, అవార్డులు ఎక్కువ అనే చెప్పాలి. అందరి హీరోయిన్స్ లా కమర్షియల్ సినిమాలను ఎంచుకోకుండా, తనకి నచ్చిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథలను మాత్రమే ఎంచుకొని చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఇక ఆ సినిమాలతోనే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొని కొత్త రికార్డులు సృష్టిస్తుంటారు. తాజాగా సాయి పల్లవి ఓ కొత్త రికార్డుని అందుకున్నారు.

రెండేళ్లలో నాలుగు ఫిలింఫేర్ అవార్డులను అందుకొని వారేవా అనిపించారు. సౌత్ ఫిలింఫేర్ అవార్డుల్లో గత ఏడాది.. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకున్నారు. ఇక ఈ ఏడాది కూడా రెండు సినిమాలకు కూడా రెండు అవార్డులను దక్కించుకున్నారు. విమర్శల ప్రశంసలు అందుకున్న గార్గి, విరాటపర్వం సినిమాలకు గాను సాయి పల్లవి ఈ ఏడాది సౌత్ ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకున్నారు.

ఇలా వరుసగా రెండేళ్లలో నాలుగు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్న నటిగా సాయి పల్లవి కొత్త రికార్డు సృష్టించింది. ఇక ఈ ఫిలింఫేర్ పై సాయి పల్లవి ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ.. ఈ ఏడాది ప్రకటించబోయే నేషనల్ అవార్డుల్లో కూడా గార్గి సినిమాకు గాను సాయి పల్లవి అవార్డుని అందుకుంటుందని తమ అంచనాలను చెబుతున్నారు. మరి సాయి పల్లవి ఖాతాలోకి నేషనల్ అవార్డు కూడా వచ్చి చేరుతుందేమో చూడాలి.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ తో ఓ సినిమా, తెలుగులో నాగచైతన్యతో ఓ సినిమా, హిందీలో రణ్‌బీర్ కపూర్ తో ఓ సినిమా, ఆమిర్ ఖాన్ వారసుడుతో ఓ సినిమా చేస్తున్నారు.

  Last Updated: 12 Jul 2024, 02:27 PM IST