Site icon HashtagU Telugu

Sai Pallavi quits Films?: ఆధ్యాత్మిక సేవలో సాయిపల్లవి.. సినిమాలకు గుడ్ బై చెబుతుందా!

Saipallavi

Saipallavi

ఫిదాలో (Fida) భానుమతిగా, శ్యామ్ సింగరాయ్ సినిమాలో రోజీగా నటించిన సాయి పల్లవి (Sai Pallavi) దక్షిణాదిలో చాలామంది అభిమానుల మనసులను గెలుచుకుంది. మలయాళం, తమిళం, తెలుగు పరిశ్రమలలో పాపులర్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకుంది. ఈ బ్యూటీ 2022లో విడుదలైన గార్గి మూవీలో కనిపించింది. అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అభిమానులు ఆమె తదుపరి చిత్రం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు సాయిపల్లవి ఎలాంటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అయితే కొన్ని వారాల క్రితం, సాయి పల్లవి (Sai Pallavi) వైద్య వృత్తిపై దృష్టి పెట్టడానికి సినిమాలను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్టు రూమర్స్ వినిపించాయి. కోయంబత్తూరులో సొంతగా ఆసుపత్రిని కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తన్నట్టు వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ బ్యూటీ ఆధ్యాత్మిక అవతార్‌లో కనిపించి ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఇంటర్నెట్‌లో ఈ బ్యూటీ ఫొటోలు విపరీతంగా వైరల్ (Viral) అవుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలసి సంప్రదాయ బడగ దుస్తులు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సాయి పల్లవి (Sai Pallavi) ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తుందని, అందుకే కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. నటనకు విరామం తీసుకోవడం వెనుక కారణం ఇదేనా అని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సాయి పల్లవి పూర్తిగా నటనకు స్వస్తి చెబుతుందా? అనే ప్రశ్న కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో సీతగా నటించడానికి సాయి పల్లవిని సంప్రదించినట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. శివ కార్తికేయన్ నటించిన కమల్ హాసన్ రాబోయే తమిళ చిత్రంలో కథానాయికగా నటించడానికి నటి సెలక్ట్ అయ్యిందని వార్తలు వినిపించాయి.

Also Read: Modi and KCR: ‘మోడీ – కేసీఆర్’ మళ్లీ ఒక్కటవుతారా?