Site icon HashtagU Telugu

Sai Pallavi Vs Vegetarian : ‘‘నేను మాంసాహారం మానేశానా ?’’.. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా: సాయిపల్లవి

Sai Pallavi Vs Vegetarian Ramayana Nitesh Tiwari

Sai Pallavi Vs Vegetarian : ‘రామాయణ’ మూవీలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ సినిమాపై ఎంతో టాక్ వినిపిస్తోంది. ఈ కీలకమైన మూవీలో నటిస్తున్న సాయి పల్లవి తాజాగా ట్విట్టర్ వేదికగా  ఫైర్ అయ్యారు.  ‘‘సాయి పల్లవి తాత్కాలికంగా మాంసాహారం మానేశారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయ్యేవరకు ఆమె మాంసాహారం అస్సలు తినరు. హోటల్స్‌లో కూడా ఆమె మాంసాహారం తినడం లేదు. విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా శాకాహార వంటలు చేసే వాళ్లను వెంట తీసుకెళ్తున్నారు’’ అంటూ కోలీవుడ్‌లోని ప్రముఖ మీడియా సంస్థ వార్తను ప్రచురించడంపై సాయిపల్లవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ  నిరాధారమైన వదంతులేనని ఆమె తేల్చి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు.. ఎంత పెద్దవాళ్లయినా సరే లీగల్‌ యాక్షన్‌ తీసుకునేందుకు వెనుకాడనని సాయిపల్లవి వార్నింగ్ ఇచ్చారు.

Also Read :Kallattikulam : అనగనగా ఒక ఊరు.. నాడు జనాభా 200.. నేడు జనాభా 6.. కేవలం మహిళలే

ఇకపై ఇలాంటి చెత్త కథనాలను చూస్తూ ఊరుకోవడానికి తాను సిద్ధంగా లేనని సాయిపల్లవి వెల్లడించారు. గతంలో ఎన్నోసార్లు రూమర్స్ వస్తే ఊరుకున్నప్పటికీ.. ఇక ఊరుకునేది లేదన్నారు. ‘‘నా సినిమాల విడుదల, నా యాడ్స్, నా కెరీర్‌ వంటి విషయాల్లో నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్నారు.. వాటిని ఇక సహించను’’ అని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Also Read :Alimony Deciding Factors : విడాకుల భరణం నిర్ణయించడానికి 8 మార్గదర్శకాలు.. జారీ చేసిన సుప్రీంకోర్టు

ఇటీవలే అమరన్‌తో భారీ విజయాన్ని సాయిపల్లవి(Sai Pallavi Vs Vegetarian) అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో తండేల్‌ మూవీలో నటిస్తున్నారు. తండేల్ మూవీలో నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. మొత్తం మీద రామాయణ మూవీలో సీత పాత్రలో సాయిపల్లవి యాక్షన్‌ను చూసేందుకు ఆమె అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రామాయణ మూవీపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.