Site icon HashtagU Telugu

Sai Pallavi: శ్రీకాకుళం స్లాంగ్ ను పట్టేసిన సాయిపల్లవి, డెడికేషన్ కు ఫిదా కావాల్సిందే

Sai Pallavi in Venu Yellamma

Sai Pallavi in Venu Yellamma

Sai Pallavi: నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ మూవీలో హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే గ్రామీణ మహిళ పాత్ర కోసం మేకోవర్ కానున్నారు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఈ కథలో చై ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడిగా నటిస్తుండగా, సాయి పల్లవి ఒక గ్రామీణ మహిళగా, చై ప్రేమికురాలిగా నటిస్తోంది. అయితే శ్రీకాకుళం యాసను తన వంతుగా పొందేందుకు శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.

సాయి పల్లవి పాత్ర అనేక కోణాలను కలిగి ఉంటుంది. ఆమె హీరోతో గాఢమైన ప్రేమలో ఉన్నప్పటికీ, ఆమె తన హక్కుల విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని, ఒక్కోసారి తీవ్రంగా కూడా ఉంటుందని దర్శకుడు చందూ మొండేటి చెప్పారు. “నటి అనేక వర్క్ షాపులో పాల్గొంది. అంకితమైన శిక్షకుడి వద్ద శ్రీకాకుళం యాసను కూడా నేర్చుకుంది” అని ఆయన చెప్పారు.

“ఆమె శ్రీకాకుళం స్లాంగ్‌ని పట్టుకుంది. పాత్ర కోసం ఆమె చేస్తున్న ప్రయత్నం చూసి ఆశ్చర్యపోయాను” అని చందూ పంచుకున్నారు. ఇటీవలనే తండేల్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి పల్లవి తొలిసారి మాట్లాడుతూ.. ”ఇలాంటి ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ స్క్రిప్ట్ లో భాగమైనందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను. టీమ్‌కి ఈ సినిమాపై విజన్ ఉంది, దానిని సరైన రీతిలో తెరపైకి తీసుకువెళ్లాలని భావిస్తున్నాం. ” అని అన్నారు. చై, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ఇది రెండోసారి. అయితే సాయిపల్లవి ఇప్పటికే ఫిదా మూవీలో తెలంగాణలో యాసలో డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను ఫిదా చేసిన విషయం తెలిసిందే.

Also Read: Gutha Sukender Reddy: నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు!