Site icon HashtagU Telugu

Sai Pallavi : స్టార్ నటుడి కొడుకుతో సీక్రెట్ గా సాయి పల్లవి.. జపాన్ వెళ్లి మరీ..!

Sai Pallavi Secretly Going To Japan With Star Hero Son

Sai Pallavi Secretly Going To Japan With Star Hero Son

ఫిదా బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) స్టార్ హీరో కొడుకుతో కలిసి జపాన్ వెళ్లిదా.. అక్కడ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా అతనితో ఏం చేస్తుంది. అసలు సాయి పల్లవికి స్టార్ హీరోతో జపాన్ వెళ్లాల్సిన పని ఏంటి.. టైటిల్ చూసి ఇవన్ని ఆలోచన రావడం కామనే. స్టార్ హీరోయిన్ అయినా ఆమె క్యారెక్టర్ విషయంలో క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చుకుంది సాయి పల్లవి.

We’re now on WhatsApp : Click to Join

సినిమాలు చేస్తున్నా సరే ఎలాంటి నాన్ సెన్స్ థింగ్స్ ఆమె విషయంలో వినిపించవు. అలాంటిది స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి జపాన్ వెళ్లడంపై మీడియాలో స్పెషల్ న్యూస్ అయ్యింది.

అయితే అసలు విషయం ఏంటి అంటే సౌత్ లో సత్తా చాటుతున్న సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తుందని తెలిసిందే. అయితే ఆ సినిమా కన్నా ముందే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ పెద్దబ్బాయ్ జునై ఖాన్ హీరోగా చేస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. జునైద్ మొదటి సినిమా యశ్ రాజ్ ఫిలింస్ లో మహారాజ్ అని చేస్తున్నాడు.

రెండో సినిమా కూడా మొదలైంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె జపాన్ వెళ్లింది. అక్కడ కీలక సన్నివేశాల షూటింగ్ చేస్తున్నారట. రీసెంట్ గా చెల్లి పెళ్లిలో హడావిడి చేసిన సాయి పల్లవి ఆ తర్వాత ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యిందని తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ఆమీర్ ఖాన్ దగ్గర ఉండి చూసుకుంటున్నాడట. జపాన్ లో ఇప్పటివరకు ఏ సినిమా షూట్ చేయని సప్పోరో ఏరియాలో ఈ సినిమా షూటింగ్ చేసేందుకు పర్మిషన్ తెచ్చుకున్నారట.

సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా స్పెషల్ గా ఉంటుంది కాబట్టే అమ్మడు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుందని చెప్పొచ్చు. ఇక సాయి పల్లవి తెలుగులో నాగ చైతన్యతో తండేల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రెండు భారీ సినిమాలు లైన్ లో ఉన్నట్టు టాక్.

Also Read : Megastar Chiranjeevi Viswambhara Release Date : మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ డేట్ లాక్..?