సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి సాయి పల్లవి (Sai Pallavi). తన సహజమైన అభినయం, ప్రత్యేకమైన నటనా శైలి, ప్రతిభతో తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సాంప్రదాయ గ్లామర్ హీరోయిన్‌లా కాకుండా, కథకు ప్రాధాన్యతనిచ్చే, సుదీర్ఘమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఆమె నటన చూసిన ప్రతి ఒక్కరికీ సహజత్వం, ఎమోషనల్ కనెక్షన్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అనిపించక మానదు. సాయి పల్లవి కెరీర్ ప్రారంభంలోనే తన విలక్షణతను నిరూపించుకుంది. ‘ప్రేమమ్’ సినిమాతో పరిచయమైన ఆమె, తొలి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత ‘ఫిదా’, ‘డియర్ కామ్రేడ్’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సినిమాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించి, తన స్థాయిని మరింత పెంచుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా, పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నో చెప్పే ధైర్యం సాయి పల్లవిలో ఉంది.
IPL 2025 Schedule: మరికాసేపట్లో ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల..!
నటిగా ఉన్నతమైన ప్రామాణికాలను పాటించే ఆమెకు ఓ గొప్ప కల ఉంది అదే జాతీయ అవార్డు గెలుచుకోవడం. ఒక ఇంటర్వ్యూలో తన తల్లి ఇచ్చిన చీర గురించి చెబుతూ.. “జాతీయ అవార్డు అందుకునే రోజున దానిని కట్టుకుని ఆ వేడుకకు హాజరవుతాను” అని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ‘గార్గి’, ‘విరాటపర్వం’ సినిమాల ద్వారా ఆమె తన గొప్ప నటనా ప్రతిభను ప్రదర్శించినా, జాతీయ అవార్డు గెలుచుకునే అదృష్టం రాలేదు. ఇటీవల ఆమె నటించిన ‘అమరన్’, ‘తండేల్’ చిత్రాల్లో కూడా తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రతిసారీ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని, వాటిని తనదైన శైలిలో పోషిస్తూ ప్రేక్షకుల చేత హర్షధ్వానాలు అందుకుంటున్న సాయి పల్లవి, ఈసారి అయినా జాతీయ అవార్డు అందుకుంటుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో జాతీయ ఉత్తమ నటి అవార్డు సాయి పల్లవి అందుకోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు.