Sai Pallavi 2022 లో విరాట పర్వాం మలయాళంలొ గార్గి సినిమాలు చేసిన సాయి పల్లవి ఏడాదిన్నర వరకు ఒక్క సినిమాకు కూడా సై చేయలేదు. లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో నాగ చైతన్య తండేల్ కు ఫిక్స్ అయ్యింది అమ్మడు. ఇక ఆ తర్వాత బాలీవుద్ రామాయణం లో సీత పాత్రకు ఓకే చెప్పింది. ఇక మరోపక్క ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన షూటింగ్ జరుగుతుంది.
ఓ పక్క తెలుగులో తండేల్ చేస్తూ మరోపక్క బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది సాయి పల్లవి. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి మళ్లీ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. సాయి పల్లవి వరుస సినిమాలు చేయడం ఆమె ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.
తండేల్ తో పాటుగా మరో టాలీవుద్ భారీ సినిమా ఆఫర్ అమ్మడి దగ్గరకు వచ్చిందట. అయితే ఆ సినిమాకు సంబందించిన అఫీషియన్ల్ అనౌన్స్ మెంట్ ఇంకా బయటకు రాలేదు. నాగ చైతన్యతో ఆల్రెడీ లవ్ స్టోరీ తీసి హిట్ అందుకున్న సాయి పల్లవి తండేల్ తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తుంది. చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న తండేల్ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Nani : నాని జోరు బాగుందిగా.. ఓజీ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్..!