సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల పారితోషికాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకటి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అంటే చాలు వెంటనే రెమ్యూనరేషన్లు అమాంతం పెంచేస్తూ ఉంటారు. ముఖ్యంగా సక్సెస్‌ఫుల్ కథానాయికల పారితోషికం చూస్తుంటో అబ్బో అని అనకమానరు. అలా దక్షిణాదిలో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో నయనతార కూడా ఒకరు. కాగా నయన్ ఈమె బాలీవుడ్ చిత్రం జవాన్ కోసం రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కాగా నటి సాయి పల్లవి ఇప్పుడు ఆమెను అధిగమించేశారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది.
ఈమె నటించిన చిత్రాల్లో అధిక శాతం విజయాన్ని అందుకోవడమే ఇందుకు కారణం అని భావించవచ్చు. ఇటీవల తమిళంలో శివకార్తికేయన్ కు జంటగా సాయి పల్లవి నటించిన అమరన్ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలో సాయిపల్లవి నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా నాగ చైతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రం హిట్ అయ్యింది. దీంతో మంచి అవకాశాలు సాయి పల్లవి వైపు చూస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ సహజ నటి రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. నటుడు రణ్‌వీర్ కపూర్ రాముడిగానూ, యాష్ రావణుడి గానూ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది.
అంతే కాదు రామాయణ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో తొలి భాగంలో నటించడానికే నటి సాయి పల్లవి రూ.15 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా నటి నయనతార ఇప్పటి వరకూ రూ. 12 కోట్లు దాటలేదని, ఆ విధంగా చూస్తే నటి సాయిపల్లవి ఆమెను దాటేశారని ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, పారితోషికం విషయంలో సాయిపల్లవి నటి నయనతారను అధిగమించారనే ప్రచారం మాత్రం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇది నిజమైతే సాయి పల్లవి అభిమానులకు పండగ లాంటి వార్త అని చెప్పాలి.