Sai Pallavi : సాయి పల్లవి అక్కడ స్టార్ రేంజ్ లెక్క ఇది..!

Sai Pallavi సౌత్ స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి స్టోరీ సెలక్షన్స్ లో అసలు కాంప్రమైజ్ అవ్వదు. అవసరమైతే సినిమా వదులుకుంటుంది

  • Written By:
  • Publish Date - June 1, 2024 / 07:50 PM IST

Sai Pallavi సౌత్ స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి స్టోరీ సెలక్షన్స్ లో అసలు కాంప్రమైజ్ అవ్వదు. అవసరమైతే సినిమా వదులుకుంటుంది కానీ తనకు ఇష్టం లేని సినిమాలు చేయదు. తెలుగులో విరాట పర్వం తర్వాత ఈమధ్యనే తండేల్ సినిమాకు సైన్ చేసిన సాయి పల్లవి బాలీవుడ్ లో మాత్రం రెండు భారీ సినిమాల్లో నటిస్తుంది. అమీర్ ఖాన్ తనయుడి హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి ఆ సినిమాతో పాటుగా బాలెవుడ్ రామాయణంలో కూడా సీత పాత్రలో కనిపిస్తుంది.

ఐతే ఈ క్రమంలో సాయి పల్లవికి బాలీవుడ్ నుంచి ఒక క్రేజీ ఆఫర్ వచ్చిందట. సినిమాలో ఆమె గ్లామర్ గా కనిపించాలని ఆఫర్ వచ్చిందట. అంతేకాదు లిప్ లాక్ సీన్ కూడా ఉంటుందని దానికి తగినట్టుగానే రెమ్యునరేషన్ డబుల్ ఇస్తామని అన్నారట. అయితే సాయి పల్లవి ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. హీరోయిన్ గా తను పెట్టుకున్న కొన్ని కండీషన్స్ ని సాయి పల్లవి దాటాలని అనుకోవట్లేదు.

అందుకే ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే ఆమెకు నచ్చకపోతే మాత్రం కాదనేస్తుంది. సాయి పల్లవి సౌత్ సినిమాల్లో ఎలాగైతే కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించిందో బాలీవుడ్ లో కూడా అలానే కొనసాగాలని అనుకుంటుంది. మరి ఇలానే ఉంటూ సాయి పల్లవి బాలీవుడ్ లో రాణించగలుగుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Priyanka Jain Latest Photoshoot : ప్రియాంక మెరుపులు అదుర్స్.. తడిసిన అందాలతో పిచ్చెక్కిస్తున్న అమ్మడు..!