Site icon HashtagU Telugu

Keerthy Suresh: సాయిపల్లవి ఔట్, కీర్తి సురేశ్ ఇన్, వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మహానటి!

Keerthy Suresh

Keerthy Suresh

సినీ నిర్మాత చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా సాయి పల్లవిని మొదట తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి. హిట్ మూవీ “లవ్ స్టోరీ” (Love Story)లో వారి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో పాటు సక్సెస్ కూడా అందుకుంది.  విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, నిర్మాతలు సినిమాను ప్రమోట్ చేయడానికి హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని భావించారు. కానీ అయితే ఆ పాత్ర చివరికి కీర్తి సురేష్‌కి దక్కింది.

నిర్మాతలు సాయి పల్లవిని సంప్రదించదు. కానీ మొదటి ఆమెనే సెలెక్ట్ చేశారట. కానీ కీర్తి సురేష్, నాగ చైతన్యల జంట తెరపైకి సరికొత్త డైనమిక్‌ని తీసుకువస్తుందని వారు నమ్మారు. అందుకే కీర్తిని నటింపజేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కీర్తి సురేష్ ఈ చిత్రానికి సంబంధించిన పనులను ప్రారంభించనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని బన్నీ వాస్ భారీ ఎత్తున నిర్మించనున్నారు. టీవీ రియాలిటీ డ్యాన్స్‌ షోతో ఢీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయిపల్లవి (Sai Pallavi).

తన పర్‌ఫార్మెన్స్ తో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ భామ తొలిసారి లీడ్ రోల్‌లో మలయాళ ప్రాజెక్ట్‌ ప్రేమమ్‌ లో మెరిసింది. ఈ చిత్రంలో సాయిపల్లవి పోషించిన మలర్‌ పాత్రను మూవీ లవర్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. తెలుగులో శేఖర్‌ కమ్ముల డైరెక్ట్‌ చేసిన ఫిదాలో భానుమతిగా కనిపించి.. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. మంచి మంచి ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తుండటంతో ఆ అవకాశాలన్నీ శ్రీలీల, కీర్తి సురేశ్ లాంటివాళ్లను వరిస్తున్నాయి.

Also Read: Battini Harinath Goud: చేప ప్రసాదం దాత ‘బత్తిని హరినాథ్ గౌడ్’ ఇకలేరు