Valantines day Special : చైతు – సాయి పల్లవిల ‘వాలంటైన్స్ డే’ రీల్‌కు ఫిదా అవ్వాల్సిందే..

లవ్ స్టోరీ (Love Story) తో అందర్నీ ఫిదా చేసిన నాగ చైతన్య – సాయి పల్లవి (Naga Chaitanya – Sai Pallavi) ..ఇప్పుడు తండేల్ (Thandel ) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఈరోజుగా వాలంటైన్స్ డే సందర్భంగా చైతు – సాయి పల్లవి కలిసి ఓ […]

Published By: HashtagU Telugu Desk
Chaitu Sai

Chaitu Sai

లవ్ స్టోరీ (Love Story) తో అందర్నీ ఫిదా చేసిన నాగ చైతన్య – సాయి పల్లవి (Naga Chaitanya – Sai Pallavi) ..ఇప్పుడు తండేల్ (Thandel ) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఈరోజుగా వాలంటైన్స్ డే సందర్భంగా చైతు – సాయి పల్లవి కలిసి ఓ రీల్ చేసారు. ఇప్పుడు ఈ రీల్ అందర్నీ ఫిదా చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

సాయి ప‌ల్ల‌వి, నాగ చైత‌న్య ఇద్ద‌రు క‌లిసి వాలంటైన్స్ డే విషెస్ చెప్పారు. జపాన్‌లో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. హైదరాబాద్‌లో ఉన్నా చైతూతో కలిసి.. తమ అభిమానులకు ట్విట్ట‌ర్ ద్వారా ఒక క్యూట్ రీల్ ని షేర్ చేశారు. ‘తండేల్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో ఉన్న డైలాగ్ తో ఈ రీల్ చేశారు. బుజ్జి త‌ల్లి కాస్త న‌వ్వే.. అంటూ నాగ‌చైత‌న్య‌..అనగానే సాయి నవ్వుతు కనిపించింది..ఈ రీల్‌ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. శ్రీ‌కాకుళం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ‘తండేల్’ షూటింగ్‌ షెడ్యూల్ పూర్తి కావడంతో సాయి ప‌ల్ల‌వి అమీర్ ఖాన్ కొడుకుతో క‌లిసి న‌టిస్తున్న బాలీవుడ్ సినిమా కోసం జ‌పాన్ వెళ్లారు. ప్ర‌స్తుతం అక్క‌డే స్నో ఫెస్టివ‌ల్ లో షూటింగ్ జ‌రుగుతోంది. దానికి సంబంధించి ఫొటోలు కూడా వైర‌ల్ గా మారాయి. చాలా గ్యాప్ తర్వాత సాయి పల్లవి వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో ‘తండేల్’తోపాటు త‌మిళ సినిమా ఎస్ కే – 21లో శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ఆమె నటిస్తుంది.

Read Also : Jaya Prada : జయప్రదకు షాక్ ఇచ్చిన కోర్ట్.. అరెస్ట్‌ కు ఆదేశాలు

  Last Updated: 14 Feb 2024, 01:26 PM IST