Site icon HashtagU Telugu

Sai Pallavi : దండలతో సాయి పల్లవి.. సొంత కథ అల్లేసిన మీడియా..!

Sai Pallavi Marriage Here I

Sai Pallavi Marriage Here I

జరిగింది ఒకటి అయితే మరోలా ప్రెజెంట్ చేయడం కొన్ని మీడియా సంస్థలకు అలవాటే. అసలు జరిగిన అసలు మ్యాటర్ కన్నా వీళ్లు క్రియేట్ చేసిన యాడెడ్ స్టఫ్ కి ఎక్కువ అటెన్షన్ వచ్చేలా చేస్తారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి పెళ్లంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు.

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) పూల దండలతో కనిపించడం.. ఆమె పక్క అదే దండతో మరో వ్యక్తి కనిపించడంతో మీడియా సొంత కథనాలు అల్లడ మొదలు పెట్టింది. ఓ పక్క సాయి పల్లవి కొత్త సినిమాలేవి సైన్ చేయకపోవడంతో ఆమె పెళ్లి చేసుకునేందుకే ఇలా చేస్తుందని ఆ పూల దండల ఫోటోలతో సాయి పల్లవికి పెళ్లంటూ హడావిడి చేశారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పూల దండలతో కనిపిస్తే చాలు పెళ్లంటూ చెబితే నమ్మే సమాజంలో ఉన్నాం మనం.

సాయి పల్లవి (Sai Pallavi) విషయంలో కూడా నిజానిజాలు ఏంటని తెలుసుకోకుండానే సాయి పల్లవి పెళ్లంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అసలు మ్యాటర్ తెలిసి అందరు అవాక్కయ్యారు. సాయి పల్లవి తన కొత్త సినిమా ఓపెనింగ్ నాడు పూల దండలు వేసుకోగా ఆ చిత్ర యూనిట్ మొత్తం అవే దండలతో కనిపించింది. కానీ సినిమా దర్శకుడు సాయి పల్లవి ఇద్దరు మాత్రమే ఫ్రేం లో ఉండే సరికి ఆ ఫోటో తో సాయి పల్లవి పెళ్లంటూ వార్తలు మొదలు పెట్టారు.

హీరోయిన్స్ పెళ్లి విషయంలో మీడియా చూపించే అత్యుత్సాహం అందరికీ తెలిసిందే. పెళ్లి కాకుండా అయినట్టుగా ప్రచారం చేసి ఆడియన్స్ అటెన్షన్ ని పొందాలని అనుకుంటారు. అంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటని ఒక్కసారి కూడా ఆలోచించరు. సాయి పల్లవి పూల దండల ఫోటోలు ఆమె ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యేలా చేయగా అసలు రీజన్ ఇది అని తెలిసి అందరు రిలాక్స్ అయ్యారు.

సాయి పల్లవి శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న తమిళ సినిమా ఓపెనింగ్ నాడు తీసిన ఫోటో అది. సాయి పల్లవి కొత్త సినిమాలకు సైన్ చేయట్లేదని ఆమెకు పెళ్లంటూ కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ చేశారు. ఫైనల్ గా సాయి పల్లవి సినిమా ఓపెనింగ్ ఫోటో అని తెలిసి నాలిక కరుచుకున్నారు.

Also Read : Anasuya : పెదకాపు-1.. అనసూయ బోల్డ్ అటెంప్ట్..!