Site icon HashtagU Telugu

Sai Pallavi : సాయి పల్లవి డైరెక్షన్.. కోలీవుడ్ మీడియా వార్తల వెనుక రీజన్ ఏంటి..?

Sai Pallavi in Venu Yellamma

Sai Pallavi in Venu Yellamma

సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) వరుస సినిమాలతో బిజీగా ఉంది. సాయి పల్లవి సినిమా చేస్తుంది అంటే కచ్చితంగా ఆ సినిమాలో మ్యాటర్ ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఇచ్చిన పాత్రకు అమ్మడు తన 100 పర్సెంట్ ఇచ్చేస్తుంది. మొన్నటిదాకా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. బాలీవుడ్ రామాయణ్ తో పాటుగా ఆమీర్ ఖాన్ తనయుడు హీరోగా చేస్తున్న సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

తెలుగులో సాయి పల్లవి క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఆమెను లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. హీరోయిన్ గానే కాదు సాయి పల్లవి సినీ పరిశ్రమకు మరో విధంగా కూడా తన టాలెంట్ చూపించాలని ఉందని చెప్పింది. రీసెంట్ గా కోలీవుడ్ ఇంటర్వ్యూ లో సాయి పల్లవి తనకు డైరెక్షన్ కూడా చేయాలని ఉందని చెప్పింది. అయితే దానికి ఇంకా చాలా టైం ఉందని. తప్పకుండా డైరెక్షన్ చేస్తానని అన్నది.

మహిళా దర్శకులకు మంచి డిమాండ్ ఉంటుంది. అదికూడా స్టార్ హీరోయిన్ గా చేసిన భామలు డైరెక్షన్ చేస్తే వేరే లెవెల్ లో ఉంటుంది. తెలుగులో విజయ నిర్మల, నందిని రెడ్డి, తమిళంలో సుధ కొంగర సరసన సాయి పల్లవి నటిస్తుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Anjali : తెలుగు నిర్మాతతో అంజలి పెళ్లి..? ఏడాదిగా డేటింగ్ కూడా..?