Site icon HashtagU Telugu

Sai Pallavi : కాలేజీ ఫెస్ట్‌లో సాయి పల్లవి డాన్స్ చూశారా.. రింగ రింగ అంటూ అల్లు అర్జున్ పాటకి..

Sai Pallavi Dance Video

Sai Pallavi Dance Video

Sai Pallavi : తమిళనాడుకి చెందిన సాయి పల్లవి.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా రెండు తమిళ్ సినిమాల్లో మొదటిసారిగా కనిపించారు. ఆ తరువాత తమిళ ఛానల్ లో ప్రసారమయ్యే ఓ డాన్స్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పోటీ చేసారు. ఆ షో తరువాత తెలుగు డాన్స్ షో ‘ఢీ’లో కూడా కంటెస్టెంట్ గా సాయి పల్లవి చేసారు. అలా ఆడియన్స్ లో ఒక మంచి డాన్సర్ గా మొదటి గుర్తింపుని సంపాదించుకున్నారు.

ఈ రెండు డాన్స్ షోలు తరువాత మళ్ళీ చదువు మీద ఫోకస్ పెట్టి.. డాక్టర్ చదవడానికి వెళ్లారు. ఇక ఆ సమయంలో కాలేజీ ఫెస్ట్ లో తన డాన్స్ టాలెంట్ అంతా చూపిస్తూ.. అక్కడి స్టేజి పై డాన్స్ వేసి అదుర్స్ అనిపించారు. అల్లు అర్జున్ నటించిన ఆర్య 2లోని ‘రింగ రింగ’ పాటకి మాస్ డాన్స్ వేసి సూపర్ అనిపించారు. అలాగే బాలీవుడ్ ఆల్ టైం చార్ట్ బస్టర్ ‘షీలాకి జవానీ’ పాటకి కూడా సూపర్ డాన్స్ వేసి విజుల్స్ అందుకున్నారు. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

కాగా డాన్స్ షోలకు గుడ్ బై చెప్పి చదువు వైపు వెళ్లిన సాయి పల్లవి.. 2015లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. మలయాళ సినిమా ‘ప్రేమమ్’లో మల్లార్ గా కనిపించి అందరి మనసులను దోచుకున్నారు. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా సూపర్ ఫేమ్ ని సంపాదించుకున్నారు. దీంతో సౌత్ లోని ఇతర భాషల్లో నుంచి సాయి పల్లవికి అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ పల్లవి మాత్రం.. చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చారు.

ఈ విషయమే ఆమెను ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. వారి అభిమానంలో ఆమె ప్రత్యేక స్థానం కల్పించింది. ఇక ఇలా సెలెక్టివ్ చేయడం వల్ల.. 17 ఏళ్ళ కెరీర్ లో 17 సినిమాలు మాత్రమే చేసారు. కానీ ఈ సినిమాలతో సాయి పల్లవి.. ఈ హీరోయిన్ అందుకోలేని స్టార్‌డమ్ ని అందుకొని లేడీ పవర్ స్టార్ అనే బిరుదుని అందుకున్నారు.

Also read : Vishal : జగన్‌పై జరిగిన రాయి దాడిపై.. హీరో విశాల్ ఏమన్నారంటే..

Exit mobile version