Sai Pallavi ఫిదాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా యువ హీరోలతోనే చేసింది. కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది కానీ తెలుగులో ఆ ఛాన్స్ రాలేదు. అయితే ఫస్ట్ టైం సాయి పల్లవికి ఆ అవకాశం వచ్చిందని తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.
ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు చేస్తున్న సినిమాలో చరణ్ హీరోగా నటిస్తుండా సినిమాలో ఫీమేల్ లీడ్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేశారని టాక్. పాత్ర ప్రాధాన్యత ఉండాలే కానీ తన అభినయంతో మెప్పిస్తూ వస్తున్న సాయి పల్లవి చరణ్ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.
టాలీవుడ్ లో సాయి పల్లవికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తప్పకుండా ఆమె క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ వుతుంది. అయితే చరణ్ సినిమాలో సాయి పల్లవి చేస్తే ఆమె కెరీర్ కు కూడా అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కోలీవుడ్ లో సూర్య, ధనుష్ లాంటి హీరోలతో నటించిన సాయి పల్లవి తెలుగులో మాత్రం నాని, వరుణ్ తేజ్, నాగ చైతన్య లాంటి హీరోలతో సరిపెట్టుకుంది.
అమ్మడికి మెగా ఛాన్స్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఇక మీదట ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. విరాటపర్వం, గార్గి సినిమాల తర్వాత సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న సాయి పల్లవి ఆర్సీ 16లో అవకాశం అందుకోవడం లక్కీ అని చెప్పొచ్చు.
Also Read : Pawan Kalyan : ఎలక్షన్స్ తర్వాతే సినిమాలు.. పవన్ నిర్ణయంపై వాళ్ల మైండ్ బ్లాక్..!
We’re now on WhatsApp : Click to Join