Site icon HashtagU Telugu

Sai Pallavi : సాయి పల్లవి బర్త్ డే.. తండేల్ టీం స్పెషల్ వీడియో..!

Sai Pallavi in Venu Yellamma

Sai Pallavi in Venu Yellamma

Sai Pallavi లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పుట్టినరోజు నేడు. మలయాళంలో ప్రేమం సినిమాతో సూపర్ అనిపించుకున్న అమ్మడు తెలుగులో ఫిదా సినిమాతో తెరంగేట్రం చేసింది. అప్పటి నుంచి సాయి పల్లవి అంటే తెలుగు అమ్మాయే అనేలా క్రేజ్ తెచ్చుకుంది. తనకు నచ్చిన పాత్రల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి ప్రేక్షకులను ఎప్పుడు నిరుత్సాహ పరచదు.

రెండేళ్ల క్రితం విరాటపర్వం, గార్గి సినిమాలు చేసిన సాయి పల్లవి ఆ తర్వాత కొంత టైం తీసుకుని నాగ చైతన్య తండేల్ సినిమాకు సైన్ చేసింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి రోల్ సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

ఇక లేటెస్ట్ గా నేడు సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా తండేల్ సినిమా నుంచి ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. తను నవ్వితే మేము నవ్వాం.. తను ఏడిస్తే మేము ఏడ్చాం.. అంటూ సాయి పల్లవి సంబందించిన షూటింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. తండేల్ సినిమాకు సాయి పల్లవి స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాతో పాటుగా సాయి పల్లవి బాలీవుడ్ రామాయణం లో నటిస్తుంది. దీనితో పాటుగా ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ సినిమాలో కూడా సాయి పల్లవి ఛాన్స్ అందుకుంది.