Sai Durgha Tej : సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్.. ‘విరూపాక్ష’తో సూపర్ హిట్టుని అందుకున్నారు. ఆ తరువాత మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ అనే సినిమా చేసి మంచి విజయానే నమోదు చేసారు. అయితే ఆ తరువాత సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఒక చిన్న సర్జరీ కోసం షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి చికిత్స తీసుకున్నారు. ఇక ఈ మధ్యలో సంపత్ నందితో ఓ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ.. అది ఇప్పటికి పట్టాలు ఎక్కలేదు. ఆ సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే, ఈ హీరో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడక్షన్ లో ఓ సినిమాకి ఈ సైన్ చేసారు. ఈ సినిమాని కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం వర్గాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమా కథ కేజీఎఫ్ తరహాలో ఉండబోతుందట. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో మైనింగ్ బ్యాక్‌డ్రాప్ తో రాయలసీమ ప్రాంతంలో ఈ సినిమా కథ జరుగుతుందట. ఈ చిత్రానికి ‘సంబరాల ఏటిగట్టు’ అనే టైటిల్ ని పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసి షూటింగ్ మొదలు పెట్టనున్నారట. అలాగే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, కాస్టింగ్ డీటెయిల్స్ గురించి కూడా త్వరలో తెలియజేయనున్నారు.
కాగా సంపత్ నందితో అనౌన్స్ చేసిన ‘గాంజా శంకర్’ సినిమా ఏమైందో తెలియడం లేదు. ఆ మధ్య టైటిల్ విషయంలో పోలీసులు ఈ సినిమాకి నోటీసులు పంపించడంతో.. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఉందని తెలిసింది. మరి ఇప్పటికి ఉందా లేదా అనేది క్లారిటీ లేదు.