Sai Durga Tej సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తన కెరీర్‌లో 19వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. #SDT19 అనే వర్కింగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. యుగాల నాటి రహస్యాలు, ఊహకందని శక్తుల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందని స్పష్టమవుతోంది.
Secrets of the Ages… Power beyond imagination.
Stepping into something truly powerful…
Excited to be part of this journey with the Dynamic directors @Dir_Sujith & @Dir_SandeepM and Passionate Producer @Sahugarapati7 anna#SDT19 #CosmicChronicles @Shine_Screens… pic.twitter.com/OxXyLhUK6S
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 3, 2026
విడుదలైన పోస్టర్‌లో సాయి తేజ్ ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో శక్తివంతమైన యోధుడిలా నిలబడి ఆకాశం వైపు చూస్తూ కనిపించారు. ఆకాశంలో వింత మేఘాలు, ఒక రహస్య పర్వతం, కాంతి పుంజాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీనికి ‘యుగాల నాటి రహస్యాలు.. ఊహకు అందని అపరిమితమైన శక్తి’ అనే క్యాప్షన్ జోడించడంతో ఇదొక మైథలాజికల్ టచ్ ఉన్న కాస్మిక్ అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తోంది. ఇటీవల ‘క’ చిత్రంతో విజయం సాధించిన యువ దర్శకుడు సుజిత్, సందీప్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాతో సాయి తేజ్ నిర్మాతగా కూడా మారుతుండటం విశేషం. తన తల్లి పేరు మీద ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’ అనే బ్యానర్‌ను స్థాపించి, ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
