Site icon HashtagU Telugu

Sai Dharma Tej : పవన్ ఎత్తుకొని సంతోషంతో సాయి ధరమ్ తేజ్.. వీడియో వైరల్..

Sai Dharma Tej Shares Lovely Video With Pawan Kalyan

Sai Dharma Tej Shares Lovely Video With Pawan Kalyan

Sai Dharma Tej : ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ క్లీన్ స్వీప్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడం కాకుండా, కేవలం ఒక్క సీట్ మాత్రమే గెలిచారు. అయితే ఆ తరువాత ఆ ఒక్క సీట్ కూడా వైసీపీ ఖాతాలో చేరిపోయింది. దీంతో ఐదేళ్ల నుంచి ఒక్క అసెంబ్లీ సీట్ కూడా లేకుండా పోరాడారు. ఈ పోరాటంలో ఎన్నో అవమానాలు, మాటలు పడ్డారు. తన అభిమానులు, కార్యకర్తలు సైతం పవన్ ని ప్రశ్నించారు. కానీ వాటన్నిటికీ సమాధానాలు చెబుతూ.. నేడు వాటిని నిజం చేసి చూపించారు.

ఈ ఎన్నికల్లో కూటమితో ముందుకు కదిలిన జనసేనాని.. కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్స్ తో సరిపెట్టుకున్నారు. ఈ సీట్లు సర్దుబాటు పై పవన్ అభిమానులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసారు. కానీ పవన్ మాత్రం పోటీ చేసిన ప్రతి చోటు నుంచి గెలిచేలా వ్యూహం రచించారు. క్రిందట ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా కాపాడుకోలేకపోయిన పవన్.. ఈ ఎన్నికల్లో ప్రతి సీట్ ని గెలిపించుకున్నారు. దీంతో అభిమానులు, జనసైనికులతో పాటు మెగా కుటుంబం కూడా ఎంతో సంతోష పడుతుంది.

ఈ ఎన్నికల్లో పవన్ కోసం ఫీల్డ్ లోకి మెగా ఫ్యామిలీ కూడా బాగా కష్టపడింది. ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ కూడా కాంపెయిన్ చేసారు. ఇక నేడు పవన్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో సాయి ధరమ్ ఆనందాలకు హద్దులు లేవు. రిజల్ట్ తెలిసిన వెంటనే పవన్ ఇంటికి చేరుకున్నారు. మావయ్యని ఎత్తుకొని మరి తన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సాయి ధరమ్ తేజ్ ఉత్సాహంతో పవన్ కూడా సంబర పడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.