Sai Dharam Tej : పవన్ గెలుపు.. మొక్కు తీర్చడం కోసం తిరుమలకి సాయి ధరమ్ తేజ్..

ఎన్నికలో పవన్ గెలుపొందడంతో తన మొక్కు తీర్చడం కోసం తిరుమలకి కాళీ నడకన సాయి ధరమ్ తేజ్.

Published By: HashtagU Telugu Desk
Sai Dharam Tej Went To Tirumala For Pawan Kalyan Success

Sai Dharam Tej Went To Tirumala For Pawan Kalyan Success

Sai Dharam Tej : పదేళ్ల నిరీక్షణ తరువాత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్ లో సక్సెస్ అయ్యారు. దీంతో మెగా కుటుంబసభ్యులంతా సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే ఈ కల నెరవేరడం కోసం తాము మొక్కుకున్న మొక్కులను కూడా తీర్చుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన మొక్కుని తీర్చుకోవడం కోసం తిరుమలకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ గెలుపు వార్త తెలిసిన తరువాత సాయి ధరమ్ తేజ్ సంతోషం అంత ఇంతా కాదు.

ఎన్నికల రిజల్ట్ తెలియడంతోనే పవన్ ఇంటికి చేరుకున్న సాయి ధరమ్ తేజ్.. పవన్ కళ్యాణ్ ఎత్తుకొని తన ఆనందాన్ని తెలియజేసారు. అనంతరం చిరంజీవి ఇంటిలో పవన్ గెలుపు సంబరాలు జరుగుతున్న సమయంలో కూడా విజుల్స్ వేస్తూ తన సంతోషాన్ని బయటపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు మెగా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ గెలుపు క్షణాలు కోసం తాను తిరుమల వెంకన్న దగ్గర మొక్కుకున్నారట. దీంతో ఆ మొక్కుని తీర్చుకోవడం కోసం కాలినడక తిరుమల చేరుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇది ఇలా ఉంటే, ఈ సుప్రీమ్ హీరో ఇటీవల అల్లు అర్జున్ ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్‌ఫాలో కొట్టారు. దీనికి కారణం ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ లీడర్ కి సపోర్ట్ చేయడమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయం గురించి మెగా వారసురాలు నిహారికని ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. “నాకు దాని గురించి పెద్దగా తెలియదు. కానీ ఒకవేళ అలా చేసి ఉంటే, ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.

  Last Updated: 15 Jun 2024, 11:36 AM IST